మద్యం మాఫియా మాయాజాలం
ABN, First Publish Date - 2022-10-28T01:27:43+05:30
మద్యం మాఫియాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. లక్షల్లో మద్యాన్ని కొనుగోలు చేస్తున్న వ్యాపారులు అక్రమంగా కోట్ల రూపాయలకు పడగలెత్తేందుకు మాఫియాకు తెరలేపారు. అందుకు నియోజకవర్గంలో 28మద్యం షాపుల వ్యాపారులు సిండికేటయ్యారు.
ఒక దుకాణానికి మద్యం కొనుగోలు చేసి మరో దుకాణంలో దిగుమతి
దాడి చేసి మద్యం స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు
హుజూర్‌నగర్: మద్యం మాఫియాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. లక్షల్లో మద్యాన్ని కొనుగోలు చేస్తున్న వ్యాపారులు అక్రమంగా కోట్ల రూపాయలకు పడగలెత్తేందుకు మాఫియాకు తెరలేపారు. అందుకు నియోజకవర్గంలో 28మద్యం షాపుల వ్యాపారులు సిండికేటయ్యారు. దీనికి తోడు మద్యం వ్యాపారుల్లో అత్యధికంగా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఉండడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది.
గరిడేపల్లి మండలంలోని కీతవారిగూడెంలో మద్యంషాపులో గురువారం లూజ్ మద్యం విక్రయిస్తుండటంతో అధికారులు దృష్టి కేంద్రీకరించారు. పాలకవీడు మండలంలోని జాన్‌పహాడ్‌లో మద్యం కల్తీకి కేరా్‌ఫగా మారిందన్న విమర్శలున్నాయి. రెండు నెలల క్రితమే వివిధ రకాల బ్రాండ్లకు సంబంధించిన మద్యాన్ని కల్తీ చేస్తూ ఇక్కడ వ్యాపారులు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డా రు. ఈ షాపులో కల్తీ మద్యం విక్రయించడంతోపాటు, ఆంధ్రప్రదేశ్‌కు కూడా అక్రమంగా ఎగుమతి చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. జాన్‌పహాడ్‌లో మద్యం విక్రయాలకు డిమాండ్ ఉండటంతో కొంతమంది సిండికేట్‌గా మారి లక్కీ డ్రాలో ఈ దుకాణాన్ని దక్కించుకున్నారు. నియోజకవర్గంలోని పాలకవీడులో సైతం కల్తీ మద్యం విక్రయిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. నియోజకవర్గంలో జోరుగా కల్తీ మద్యం విక్రయాలనతోపాటు అక్రమంగా గుంటూరు జిల్లాకు రాత్రివేళల్లో మద్యం తరలిస్తున్నట్లు విమర్శలున్నాయి. గతంలో మద్యం షాపులు నిర్వహించిన వారికి ఈ సారి డ్రాలో వారికి దక్కలేదు. కొత్త వారికి మద్యం దుకాణాలు రాగా, వారికి గుడ్ విల్ ఇచ్చి పాత నిర్వాహకు లే దుకాణాలు హస్తగతం చేసుకొని కల్తీ మద్యానికి తెరలేపారన్న విమర్శలున్నాయి. కీలక నాయకులు, కౌన్సిలర్లు, సిం గిల్‌విండో చైర్మన్లు, సెంట్రల్ బ్యాంకుకు ప్రాతినిధ్యం వహిం చే కీలక నాయకులు వారి అనుచరుల పేరుతో మద్యం షాపులను నిర్వహిస్తున్నారు. హుజూర్‌నగర్‌లో మద్యం షాపులు దక్కించుకున్న కొంతమంది ఇతర ప్రాంతాలకు చెందిన వ్యాపారులను బెదిరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నా యి. వేరే ప్రాంతాల్లో మద్యం దుకాణాలను ఫలానా చోటే ఏర్పాటు చేయాలని అనుమతులు రాకుండా హుజూర్‌నగర్ వ్యాపారులు ఇబ్బందులకు గురిచేసినట్టు విమర్శలు ఉన్నా యి. కోదాడ, సూర్యాపేట, నకిరేకల్ ప్రాంతాలకు చెందిన మద్యం వ్యా పారులు డ్రాలో హుజూర్‌నగర్‌లోని దుకాణాలను దక్కించుకోగా, వారిని ఇబ్బందులకు గురిచేసి మద్యం వ్యాపారుల సిండికేట్‌లో చేర్చుకున్నట్టు వినవస్తోంది. నియోజకవర్గంలోని ఏ దుకాణంలో ఎంత మద్యం విక్రయించాలో ఈ మాఫియా సిండికేట్ నిర్ణయిస్తున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా, జాన్‌పహాడ్ మద్యం షాపులో దిగుమతి చేయాల్సిన 160బీర్ల కాటన్లు, 96కాటన్ల లిక్కర్, 34 లూజ్ బాటిళ్లను కీతవారిగూడెంలో దిగుమతి చేయడం ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
నిల్వ ఉంచిన మద్యం పట్టివేత
హుజూర్‌నగర్/గరిడేపల్లి అక్టోబరు 27: గరిడేపల్లి మండలం జాన్‌పహాడ్ మద్యం షాపునకు చెందిన 160బీర్ కాటన్లు, 96కాటన్ల వివిధ రకాల బ్రాండ్ల లిక్కర్‌ను కీతవారిగూడెంలో అక్రమంగా నిల్వచేయగా, ఎక్సైజ్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎక్సైజ్ సీఐ శ్యాంకుమార్ మాట్లాడుతూ, వాటి వివరాలు వెల్లడించారు. పాలకవీడుకు చెందిన పీఎస్ షాపు-3కు చెందిన మద్యాన్ని కీతవారిగూడెంలో అక్రమంగా నిల్వచేశారని, ఒక షాపులో ఉండాల్సిన మద్యాన్ని మరో మండలంలో నిల్వచేసి అక్రమంగా విక్రయిస్తున్నట్టు తెలిపారు. కీతవారిగూడెంలోని మద్యంషాపులో 34విడి మద్యం సీసాలు కూడా సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు షాపుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
డీడీలు తీసిన చోటే మద్యం విక్రయించాలి : శ్యాంకుమార్, హుజూర్‌నగర్ ఎక్సైజ్ సీఐ
మద్యం షాపులకు సంబంధించి డీడీలు తీసిన చోటే మద్యం దిగుమతి చేసుకుని అక్కడే విక్రయించాలి. ఒక షాపులో దిగుమతి చేయాల్సిన మద్యాన్ని మరో షాపులో దిగుమతి చే యడం నేరం. నిబంధనలకు విరుద్ధంగా పాలకవీడు మండలంలోని జాన్‌పహాడ్ షాపునకు సంబంధించిన మద్యాన్ని కీతవారిగూడెం షాపులో దిగుమతి చేయడం నిబంధనలకు విరుద్ధం. దీంతో పాటు లూజ్ మద్యం విక్రయించడం కూడా సరికాదు.
Updated Date - 2022-10-28T01:28:36+05:30 IST