ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లిఫ్టుల నిర్వహణ ప్రభుత్వమే చేపట్టాలి : రంగారెడ్డి

ABN, First Publish Date - 2022-06-25T06:56:32+05:30

నాగార్జునసాగర్‌ ఎడమకాల్వపై ఉన్న లిఫ్టులను ప్రభుత్వమే చేపట్టి నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కా ర్యదర్శవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు.

శిథిలావస్థకు చేరుకున్న ఆర్‌-1 లిఫ్టును పరిశీలిస్తున్న జూలకంటి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమలగిరి(సాగర్‌), జూన 24: నాగార్జునసాగర్‌ ఎడమకాల్వపై ఉన్న లిఫ్టులను ప్రభుత్వమే చేపట్టి నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కా ర్యదర్శవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన రైతు సంఘాలు, సీపీఎం నాయకులతో కలిసి అల్వాలలో గల ఆర్‌-1 లిఫ్టును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లిఫ్టుల ఏ ర్పాటు అనంతరం మో టార్లు మరమ్మతులకు వచ్చినా సంబంధిత శాఖ పట్టించుకోవ డం లేదని విమర్శించారు. అదేవిఽధంగా లిఫ్టులకు విద్యుత సరఫరా లేకపోవడంతో రైతులు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. లిఫ్టుల నిర్వహణ ప్రభుత్వమే చేపడుతుందని హామీ ఇచ్చిన కేసీఆర్‌ హామీ నెరవేర్చకుండా కాలయాపన చేయ డం సరికాదన్నారు. నిర్వహణ ఖర్చులను రైతులే భరించడం ఆవేదనకు గు రిచేస్తుందన్నారు. నల్లగొండలోని ఐబీ సీఈ కార్యాలయం వద్ద ఈ నెల 27వ తేదీన తెలంగాణ రైతు సంఘం, ఎత్తిపోతల పథకాల రై తు సంఘాల నేతృత్వంలో చేపట్టనున్న ధర్నా కార్యక్రమానికి రైతు లు అధిక సంఖ్యలో హాజరై విజయవం తం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట సీపీ ఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, రైతు సంఘం జి ల్లా కార్యదర్శి కూనరెడ్డి నాగిరెడ్డి, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి శంకర్‌నాయక్‌,  రవినాయక్‌, రవీందర్‌, రైతులు రవీందర్‌రెడ్డి, మోతీలాల్‌, నెహ్రూ పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-25T06:56:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising