ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లిఫ్టులకు మరమ్మతులు చేపట్టాలి

ABN, First Publish Date - 2022-06-26T06:41:12+05:30

నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉన్న లిఫ్టులకు ప్రభుత్వం నిధులు కేటాయించి, మరమ్మతులు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు.

ఎత్తిపోతల పథకం మోటార్‌ను పరిశీలిస్తున్న జూలకంటి రంగారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

మునగాల రూరల్‌, జూన్‌ 25: నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉన్న లిఫ్టులకు ప్రభుత్వం నిధులు కేటాయించి, మరమ్మతులు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన మునగాల ఎల్‌-33, కలకోవ ఎత్తిపోతల పథకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగర్‌ ఎడమ కాల్వపై ఉన్న ఎత్తిపోతల పథకాలను పూర్తిస్థాయిలో మరమ్మతులు చేప ట్టి ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ మొదలైనందున యుద్ధ ప్రాతిపదికన అవసరమైన నిధులు కేటాయించాలన్నారు. కాల్వల పూడికలు, తూముల షట్టర్లు, కాల్వ కట్టలు, రహదారులు పూర్తిచేసి ఆక్రమణకు గురికాకుండా కాపాడాలన్నారు. పలు సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27న నల్లగొండలో నీటిపారుదల సీఈ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాలో రైతులు అధిక సంఖ్య లో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బుర్రి శ్రీరాములు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, దేవరం వెంకట్‌రెడ్డి, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, బెల్లంకొండ సత్యనారాయణ, గోపిరెడ్డి మల్లారెడ్డి, దొంగరి అప్పారావు, మండవ వెంకన్న పాల్గొన్నారు.  

Updated Date - 2022-06-26T06:41:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising