ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్థాయి పెరిగింది.. సౌకర్యం దిగజారింది

ABN, First Publish Date - 2022-08-04T05:37:32+05:30

గ్రామపంచాయతీలుగా ఉన్న మోత్కూరు, కొండగడప, బుజిలాపురం గ్రామాలను కలిపి 2018 ఆగస్టు 2న మోత్కూరు మునిసిపాలిటీ చేశారు. మునిసిపాలిటీ ఏర్పడి నాలుగేళ్లు పూర్తయినా అభివృద్ధిలో గ్రామపంచాయతీలకన్నా అధ్వానంగా ఉందని విపక్షాలతోపాటు, ప్రజలు విమర్శిస్తున్నారు.

మోత్కూరు వ్యూ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోత్కూరు: గ్రామపంచాయతీలుగా ఉన్న మోత్కూరు, కొండగడప, బుజిలాపురం గ్రామాలను కలిపి 2018 ఆగస్టు 2న మోత్కూరు మునిసిపాలిటీ చేశారు. మునిసిపాలిటీ ఏర్పడి నాలుగేళ్లు పూర్తయినా అభివృద్ధిలో గ్రామపంచాయతీలకన్నా అధ్వానంగా ఉందని విపక్షాలతోపాటు, ప్రజలు విమర్శిస్తున్నారు. మునిసిపాలిటీ చేయడంతో రాజకీయంగా, ఆర్థికంగా, అభివృద్ధిపరంగా నష్టపోయామని విలీన గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోత్కూరు మునిసిపాలిటీ ఏర్పడి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక కథనం


మునిసిపాలిటీ కేంద్రమైన మోత్కూరులోనూ రొటీన్‌గా జరిగే అభివృద్ధే తప్ప ప్రత్యేక అభివృద్ధి ఏమీ లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. గ్రామాల్లో వైకుంఠధామాలు పూర్తయి ప్రారంభం కాగా మోత్కూరులో ఇటీవలే వైకుంఠధామం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కొన్ని వీధుల్లో సీసీ రోడ్లు వేశారు. అది అంతకుముందులాగా జరిగే అభివృద్ధేనంటున్నారు. మునిసిపల్‌ కార్యాలయం పాత గ్రామపంచాయతీ భవనంలోనే నడుస్తోంది. రెండు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసినా వాటి తో ప్రజలకు ఉపయోగం లేదంటున్నారు. పట్టణానికి వెలుపల బావుల వద్దకు వెళ్లే దారిలో అంగడి స్థలంలో రూ.రెండు కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మిస్తున్నారు. అక్కడ గతంలో కూరగాయల మార్కెట్‌ కోసం రూ.10లక్షల వ్యయంతో రెండు షెడ్లు నిర్మించగా అక్కడకు కూరగాయ లు అమ్మేవారు వెళ్లకపోవడంతో అవి నిరుపయోగంగా మారి గుర్తు తెలియని వ్యక్తులు ఓ షెడ్డు రేకులు మొత్తం ఎత్తుకెళ్లారు. అలాంటి చో ట నిర్మిస్తున ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ వినియోగంలోకి వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మునిసిపాలిటీ అధికారుల ఒత్తిడి తో మటన్‌, చికెన్‌ వ్యాపారులను అక్కడకు పంపగలిగినా, కూరగాయల వ్యాపారులు అక్కడకు వెళ్లడం కష్టమేనంటున్నారు. మోత్కూరుకు మం జూరైన మినీ ట్యాంకు బండ్‌ కూడా పూర్తిస్థాయిలో పూర్తి కాలేదు. పార్కుల ఊసే లేదు. అభివృద్ధి విషయంలో విపక్ష కౌన్సిలర్లు, నాయకు లే కాకుండా అధికార పార్టీ కౌన్సిలర్లు, నాయకులు కూడా అసంతృప్తితో ఉన్నారు. అధికార పార్టీ కౌన్సిలర్లు, నాయకులు బహిరంగ సంభాషణ ల్లో మునిసిపల్‌ పాలనను సమర్ధిస్తున్నప్పటికీ అంతర్గతంగా మాట్లాడుకున్నప్పుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 


ఆర్థికంగానూ, అభివృద్ధిలోనూ లోటు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు గ్రామపంచాయతీలకు ప్రతీనెల జనాభా ప్రాతిపదికన నిధులు ఇస్తున్నాయి. వాటితో వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం, సెగ్రిగేషన్‌ షెడ్లు, నర్సరీ పెంపకం, చెత్త సేకరణకు సొంత ట్రాక్టర్‌, వ్యవసాయ క్లస్టర్‌ గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణాలు లాంటి అభివృద్ధి పనులు చేస్తున్నారు.మోత్కూ రు మునిసిపాలిటీలో కలుపడంతో తమ గ్రామాలకు రావాల్సి న నిధులు రాక ఆర్థికంగా నష్టపోయామని కొండగడప, బుజిలాపురం గ్రామాల ప్రజలంటున్నారు. గ్రామపంచాయతీలుగా ఉంటే తమకు వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, సొంత ట్రాక్టర్‌. సెగ్రిగేషన్‌ షెడ్‌, నర్సరీ పెంపకం లాంటి సౌకర్యాలు సమకూరేవని, ఇప్పుడు ఆ సౌకర్యాలు లేక అభివృద్ధి పరంగానూ దెబ్బతిన్నామంటున్నారు.తమను మునిసిపాలిటీలో కలుపవద్దని కోర్టుకు వెళ్లి నా ప్రభుత్వం పట్టించుకోకుండా బలవంతంగా మోత్కూరు మునిసిపాలిటీలో కలిపారని కొండగడప గ్రామ నాయకులంటున్నారు.  


 అప్పులతో అభివృద్ధికి సన్నాహాలు

మునిసిపాలిటీ ఏర్పడినప్పుడు టీయూఎ్‌ఫఐడీసీ నుంచి రూ.20 కోట్ల నిధులు మంజూరయ్యాయని చెప్పారు. అవి అప్పు అని తెలిసి మొదట్లో పాలకవర్గం చొరవచూపలేదు. రాష్ట్రమే అప్పులు చేయగా, తాము అప్పు చేస్తే తప్పేమిటనుకున్నారో ఏమోగాని ఇప్పుడు టీయూఎ్‌ఫఐడీసీ నుంచి రూ.7.40కోట్ల నిధులు మంజూరు చేయించుకున్నారు. రూ.2కోట్లతో మెయిన్‌రోడ్డు వెంట సెంట్రల్‌ లైటింగ్‌, రూ.3కోట్లతో సీసీరోడ్లు, రూ.2.40 కోట్లతో మురుగు కాల్వల (సైడ్‌డ్రైన్స్‌) నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అందులో సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు రోడ్డు వెడల్పు చేస్తేనే సాధ్యమవుతుంది. మెయిన్‌రోడ్డు 100 అడుగులు వెడల్పు చేయాలా, రోడ్డు వెంట ఉన్న ఇళ్ల యజమానుల కోరిక మేరకు 80 అడుగుల వెడల్పు చేయాలన్న సందిగ్ధంలో పడింది. తీసుకున్న అప్పు నెల వాయిదాల్లో చెల్లించాల్సి వస్తోంది. 


ఉపాధి కోల్పోయిన కూలీలు 

మోత్కూరులో 1,989 జాబ్‌కార్డులు, 4156 మంది కూలీలు, బుజిలాపురంలో 263 జాబ్‌కార్డులు, 685 మంది కూలీలు, కొండగడపలో 504 జాబ్‌ కార్డు లు, 1090మంది కూలీలు ఉండేవారు. అందులో రోజూ సగటున 1069 కూలీలు ఉపాధి హామి పనులు చేసి ఏడాదికి రూ.52 లక్షల కూలి పొందేవారు. మునిసిపాలిటీకి ఉపాధి హామి పథకం రద్దుచేయడంతో నాలుగేళ్లలో కూలీలు రూ.రెండు కోట్లకుపైగా నష్టపోయారు. 


గ్రామపంచాయతీల కన్నా అధ్వానం : కవితలక్ష్మీనర్సింహారెడ్డి, 11వ వార్డు కౌన్సిలర్‌, మోత్కూరు

 మునిసిపాలిటీలో అభివృద్ధి గ్రామపంచాయతీల కన్నా అధ్వానంగా ఉంది. మునిసిపాలిటీలో నిధు లు ఉన్నాయంటారు. కాని పనులు చేయరు. నా వార్డులో ఇప్పటికి రెండేళ్ల కాలంలో కేవలం రూ. ఐదు లక్షల వ్యయంతో (అదీ ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధు లు) ఒక సీసీ రోడ్డు వేశాం. వార్డులో ప్రజలు అడిగే ఏ ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేక పోతున్నాం. 


అభివృద్ధి పరంగా నష్టపోయాం : లెంకల సుజాతవేణు, 3వ వార్డు కౌన్సిలర్‌, కొండగడప

మోత్కూరు మునిసిపాలిటీలో కలుపడంతో మా గ్రామ (కొండగడప) ప్రజలు రాజకీయంగా, అభివృద్ధి పరంగా నష్టపోయారు. గతంలో మా ది ఆదర్శ గ్రామం. మునిసిపాలిటీలో కలపడంతో 10 వార్డు సభ్యులు, ఒక సర్పంచ్‌, మూడు కోఆప్షన్‌ స్థానాలకు గాను ఇప్పుడు రెండు కౌన్సిలర్‌ స్థానాలు దక్కాయి. మునిసిపాలిటీలో కలుపడంతో మా గ్రామం స్వంత ట్రాక్టర్‌, వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, సెగ్రిగేషన్‌ షెడ్డు లాంటి సౌకర్యాలకు దూరమైంది.  


Updated Date - 2022-08-04T05:37:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising