ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పనులు వేగవంతం చేయాలి : కలెక్టర్‌, ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2022-05-17T06:55:09+05:30

జిల్లాకేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కోరారు. చర్లపల్లిలో అర్బన్‌ పార్కు పనులను సోమవారం వారు పరిశీలించారు. మర్రిగూడ బైపాస్‌ జంక్షన్‌ చుట్టూ రోడ్లు వెడల్పుగా ఉండాలన్నారు. బైపాస్‌ జంక్షన్‌లోని చెట్లతో అందులో ఏర్పాటు చేసిన విగ్రహాలు, సుందరీకరణ పనులు క

అర్బన్‌ పార్క్‌ పనులు పరిశీలిస్తున్న కలెక్టర్‌ పాటిల్‌, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ రూరల్‌, మే 16: జిల్లాకేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కోరారు. చర్లపల్లిలో అర్బన్‌ పార్కు పనులను సోమవారం వారు పరిశీలించారు. మర్రిగూడ బైపాస్‌ జంక్షన్‌ చుట్టూ రోడ్లు వెడల్పుగా ఉండాలన్నారు.  బైపాస్‌ జంక్షన్‌లోని చెట్లతో అందులో ఏర్పాటు చేసిన విగ్రహాలు, సుందరీకరణ పనులు కన్పించడంలేదని, చెట్లను తొలగించాలని ఆదేశించారు. మధ్యలో ఏర్పాటు చేస్తున్న డివైడర్లను పరిశీలించారు.  మర్రిగూడ బైపాస్‌ నుంచి దేవ రకొండ రోడ్డు వరకు ఏర్పాటు చేస్తున్న ఎలక్ట్రికల్‌ టవర్ల గురించి అడిగి తెలుసకున్నారు. రోడ్ల విస్తరణ, ఎలక్ట్రికల్‌, సుందరీకరణకు సంబంధించిన మెటీరియల్‌ను సిద్ధంగా సూచించారు. మార్కింగ్‌ చేసిన ప్రకారం రోడ్ల పనులను నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. దేవరకొండ రోడ్డులో దుప్పలపల్లి రోడ్డుకు వెళ్లే మార్గంలో ఒక జంక్షన్‌ ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు.  బీట్‌ మార్కెట్‌లో ఏర్పాటు చేస్తున్న వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్‌ పనులను పరిశీలించారు. అనంతరం పానగల్‌ ఉదయ స ముద్రంలో ఏర్పాటు చేయనున్న పార్కులు, వల్లభరావు చెరువు ప్రాంతంలో ఏరాఁటు చేస్తున్న వాకింగ్‌ ట్రాక్‌, సుందరీకరణ పనుల నమూనా చిత్రాలను పరిశీలించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, నల్లగొండ మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రమణాచారి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T06:55:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising