భూసేకరణ పనులను వేగవంతం చేయాలి
ABN, First Publish Date - 2022-03-05T06:40:36+05:30
ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు భాగంగా డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్
నల్లగొండటౌన్, మార్చి 4 : ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు భాగంగా డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌తో కలసి రిజర్వాయర్ పనులపై కలెక్టరేట్‌లో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా పెండ్లిపాకల రిజర్వాయర్‌తో ముంపునకు గురవుతున్న కొండమల్లేపల్లి మండలం పెండ్లిపాకల గ్రామం, గుడి తండా, పాత్యతండా నిర్వాసితులు, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌తో ముంపునకు గురవుతున్న నక్కలగండి నిర్వాసితుల సమస్యలును వివరించారు. సమావేశంలో దేవరకొండ ఆర్డీవో గోపిరామ్‌నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జగన్నాథరావు, ఆర్‌అండ్‌ఆర్ సూపరింటెండెంట్ రాజశేఖర్ పాల్గొన్నారు.
Updated Date - 2022-03-05T06:40:36+05:30 IST