ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా లక్ష తులసి పూజ

ABN, First Publish Date - 2022-08-04T05:50:43+05:30

బదరీ నారాయణ పెరుమాళ్ల తిరు నక్షత్రం (పుట్టినరోజు) పురస్కరించుకొని బుధవారం జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో లక్ష తులసి పూజను వైభవంగా నిర్వహించారు.

ప్రత్యేక ఆలంకరణలో స్వామివారు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట కల్చరల్‌, ఆగస్టు 3:  బదరీ నారాయణ పెరుమాళ్ల తిరు నక్షత్రం (పుట్టినరోజు) పురస్కరించుకొని బుధవారం జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో లక్ష తులసి పూజను వైభవంగా నిర్వహించారు. ఆండాళ్‌ గోష్ఠి భక్తబృందం ఆధ్వర్యంలో దేవాలయ ప్రధాన అర్చకుడు నల్లాన్‌ చక్రవర్తు వేణుగోపాలాచార్యులు స్వామివారికి  పట్టు వస్త్రాలతో ఆలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస్‌రెడ్డి, అర్చకులు శ్రీహరాచార్యులు, హరిచరణాచార్యులు, సంకర్షణాచార్యులు, ఫణికుమార్‌ ఆచార్యులు, సత్యనారాయణ, కృష్ణయ్య, రవీందర్‌, మల్లికార్జున్‌, శ్రీనివాస్‌, ఆండాళ్‌గోష్ఠి భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు. 

నేడు శ్రీసుదర్శన మహాయాగం

శ్రీసుదర్శన జయంతి సందర్భంగా గురువారం శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీసుదర్శన మహాయాగాన్ని నిర్వహిస్తున్నట్లు దేవాలయ ప్రధాన అర్చకుడు నల్లాన్‌ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు తెలిపారు. 






Updated Date - 2022-08-04T05:50:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising