ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లా వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు

ABN, First Publish Date - 2022-08-20T06:35:36+05:30

జిల్లా వ్యాప్తంగా శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పలు పాఠశాలల్లో చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణతో అలరించారు.

కోదాడ జయపాఠశాలలో కృష్ణాష్టమి వేడుకల్లో చిన్నారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా వ్యాప్తంగా శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.  పలు పాఠశాలల్లో చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణతో అలరించారు. ఉట్టి కొట్టి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల నృత్యాలు అంబరాన్ని అంటాయి.

- ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌

సూర్యాపేటలోని జయ పాఠశాలలో కృష్ణాష్టమిని వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

- మఠంపల్లి మండలంలోని మట్టపల్లి మహాక్షేత్రంలో, మఠంపల్లి, రఘునాథపాలెం, యాతవాకిళ్ల, పెదవీడు తదితర గ్రామాల్లో, నేరేడుచ ర్ల,తిరుమలగిరి మండలాల్లో  ఉట్టి కొట్టె కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. పలు చోట్ల చిన్నారులు శ్రీకృష్ణుని వేషధారణతో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మట్టపల్లి దేవస్థాన ధర్మ కర్తలు చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈవో నవీన్‌, భక్తులు పాల్గొన్నారు. 

- తిరుమలగిరిలోని  కృష్ణవేణి పాఠశాలలో కృష్ణాష్టమి వేడులకను నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ బత్తిని నగేష్‌, ఉపేంద్ర, కల్యాణి, సరస్వతి, పర్వీన్‌,  పాషా, ఉష, ధనలక్ష్మి పాల్గొన్నారు.

- కోదాడ పట్టణంలోని పలు పాఠశాలలు, కళాశాలల్లో కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌ఆర్‌ఎం స్కూల్‌ కరస్పాండెంట్‌ కేశినేని శ్రీదేవి, జయ స్కూల్‌ కరస్పాండెంట్‌ అక్షయ స్కూల్‌ కరస్పాండెంట్‌ డీఎల్‌ నర్సింహారావు, జయ పాఠశాల ప్రిన్సిపాల్‌ వేణు, పాల్గొన్నారు. 

- హుజూర్‌నగర్‌లోని ఎండీఆర్‌, ఆర్చిడ్‌ పాఠశాలల్లో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణల్లో అలరించారు.  అనంతరం ఉట్టికొట్టే పోటీలు  నిర్వ హించారు. కార్యక్రమాల్లో మేరెడ్డి దామోదర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.




Updated Date - 2022-08-20T06:35:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising