కేసీఆర్‌వి తుగ్లక్ నిర్ణయాలు : గడ్డం వివేక్
ABN, First Publish Date - 2022-10-07T05:41:33+05:30
సీఎం కేసీఆర్ తుగ్లక్ నిర్ణయాలు తీసుకుం టూ నియంతలా వ్యవహరిస్తున్నారని మాజీ ఎంపీ, మునుగోడు ఉప ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన గడ్డం వివేక్ ఆరోపించారు.
మునుగోడు, అక్టోబరు 6: సీఎం కేసీఆర్ తుగ్లక్ నిర్ణయాలు తీసుకుం టూ నియంతలా వ్యవహరిస్తున్నారని మాజీ ఎంపీ, మునుగోడు ఉప ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన గడ్డం వివేక్ ఆరోపించారు. మునుగోడులోని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో గురువారం రాత్రి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులో నివాసం ఉన్నారని, అందుకే తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. టీఆర్‌ఎ్‌సకు ప్రజాదరణ తగ్గతుండటంతో బీఆర్‌ఎస్ పేరుతో కొత్త నాటకాలు ఆడుతున్నాడని విమర్శించారు. మునుగోడులో జరిగే ఉప ఎన్నికలో ఓడిపోతాననే భయం పట్టుకొని మైండ్ గేమ్ రాజకీయాలతో బీఆర్‌ఎస్ పార్టీని నెలకొల్పాడని, కేసీఆర్‌కు ఇక గడ్డురోజులేనని పేర్కొన్నారు.
వీఆర్‌ఎస్ తప్పదనే భయంతో బీఆర్‌ఎస్
తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుంటున్న సీఎం కేసీఆర్‌కు వీఆర్‌ఎస్ తప్పదనే భయంతో బీఆర్‌ఎ్‌సగా పార్టీగా మార్పు చేశాడని తాజా మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా సీఎం కేసీఆర్ మైండ్ గేమ్ రాజకీయం చేస్తూ, ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. నియంత పాలనతో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా మారాయని ఆందోళన వ్యక్తంచేశారు. బీఆర్‌ఎస్ పార్టీ పెట్టడం కా దు ఈ ఉప ఎన్నికలో కేసీఆర్ పోటీకి దిగాలని సవాల్ విసిరారు.
నిరుద్యోగ సమస్య పరిష్కారం బీజేపీతోనే సాధ్యం
మర్రిగూడ: నిరుద్యోగ సమస్య పరిష్కారం బీజేపీతోనే సాధ్యమవుతుందని తాజీ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఎరగండ్లపల్లి, అ జిలాపురం, లెంకెలపల్లి, వట్టిపల్లి, శివన్నగూడెం, కమ్మగూడెం పలు గ్రామాలకు చెందిన యువకులు మాజీ ఎంపీపీ అనంతరాజుగౌడ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సంద ర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని భావించిన యువత, ప్రజలు స్వచ్ఛందంగా తమ పార్టీలో చేరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో శివన్నగూడ సర్పంచ చిట్యాల సబితా యా దగిరిరెడ్డి, ఎం పీటీసీ వెన్నమనేని రవీందర్‌రావు, శ్రీరామదాసు శ్రీనివాస్, కొడాల వెంకట్‌రెడ్డి, చిట్యాల రంగారెడ్డి, మాజీ జడ్పీటీసీ నేతరి యాదయ్య, సంపత, బంగారం ఉన్నారు.
Updated Date - 2022-10-07T05:41:33+05:30 IST