ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయాల అభివృద్ధి ఘనత కేసీఆర్‌దే

ABN, First Publish Date - 2022-08-04T06:18:08+05:30

రాష్ట్రంలో ఆలయాలను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని డీసీసీబీ చైర్మన గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



 డీసీసీబి చైర్మన్‌, గొంగిడి మహేందర్‌రెడ్డి

యాదగిరిగుట్ట రూరల్‌, ఆగస్టు 3:  రాష్ట్రంలో ఆలయాలను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని డీసీసీబీ చైర్మన గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు.  బుధవారం గుట్టలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలో ఈ నెల 2న  నిర్వహించిన బీజేపీ బహిరంగ సభకు తక్కువ జనమే హాజరయ్యారని అన్నారు. సభకు భువనగిరి, సూర్యాపేట, జనగామ, బోధన్‌ ప్రాంతాలనుంచి ప్రజలను తరలించినా కేవలం రెండు ఎకరాల స్థలంలో ప్రజలు నిండలేదని విమర్శించారు. దీంతో ప్రజల్లో బీజేపీకి ఆదరణలేదని విషయం స్పష్టం అయిందని తెలిపారు. ప్రపంచ ఖ్యాతిగడించే విధంగా  శిలలతో అబ్బురపడే విధంగా నిర్మించిన యాదగిరిగుట్ట ఆలయానికి కేంద్రం ద్వారా బీజేపీ పైసా ఖర్చుచేయలేదని తెలిపారు. బీజేపీ తమ స్వార్ధ రాజకీయాల కోసం మతాలను వాడుకుంటూ సామాన్య ప్రజలను రెచ్చగొట్టడం దుర్మార్గమని అన్నారు.  యాదగిరిగుట్టతో పాటు వేములవాడ ఆలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన నిజమైన హిందువు సీఎం కేసీఆరే అని అన్నారు.  భూ కబ్జా కేసుల్లో జైలుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్యగౌడ్‌ విమర్శలు చేయడం హాస్యాస్పదమని అన్నారు. . ఆయన సొంత ఊరు పారుపల్లికి రోడ్డువేసిన ఘనత ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డికే దక్కిందని అన్నారు.  సమావేశంలో ఆలేరు మార్కెట్‌ కమిటి చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌  మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎరుకల సుధాహేందర్‌గౌడ్‌, జడ్పీటీసీ సభ్యురాలు తోటకూరి అనురాధబీరయ్య పాల్గొన్నారు.

ఆత్మకూరు(ఎం) : మండలంలోని తుక్కాపురం టీఆర్‌ఎస్‌  గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు పొనగాని శ్రీశైలం అనారోగ్యంతో ఇటీవల మరణించాడు.  డీసీసీబీ చైర్మన గొంగిడి మహేందర్‌రెడ్డి రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని   శ్రీశైలం కుటుంబానికి అందజేశారు.  కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల మాజీ అధ్యక్షుడు భాషబోయిన ఉప్పలయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు ఎరుకల బాల్‌నర్సయ్య, నరేష్‌, సామ బుచ్చిరెడ్డి, చిక్కిరి రవి పాల్గొన్నారు.


Updated Date - 2022-08-04T06:18:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising