కేసీఆర్ కుటుంబాన్ని తరిమేయాలి
ABN, First Publish Date - 2022-10-17T06:02:55+05:30
రజకార్లను ఎదిరించిన తరహాలో ని జాం నవాబును తలపిస్తున్న సీఎం కేసీఆర్ కుటుంబాన్ని తరిమేయాల్సి న సమయం ఆసన్నమైందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
మునుగోడు, అక్టోబరు 16: రజకార్లను ఎదిరించిన తరహాలో ని జాం నవాబును తలపిస్తున్న సీఎం కేసీఆర్ కుటుంబాన్ని తరిమేయాల్సి న సమయం ఆసన్నమైందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గెలుపు కోరుతూ ఆదివారం రాత్రి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ఆత్మగౌరవ నినాదంతో తెగించి పోట్లాడి ఆత్మబలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణ కల్వకుంట్ల కుటుంటం కోసం కాదన్నారు. టీఆర్ఎస్ ఎనిమిదేళ్ల పాలనలో భూ కబ్జాలు, లిక్కర్, శాండ్, మైనింగ్, కాంట్రాక్టు మాఫియాలు, చివరికి పిల్లలు తినే మధ్యాహ్న భోజనాన్ని సైతం దోచుకుంటున్నారని ఆరోపించారు. ధనిక రాష్ట్రమని చెబుతూ, కుటుంబం బాగు కోసం ప్రజాఽధనాన్ని దోచుకుంటూ లక్షల కోట్లు అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. దోచుకున్న అక్రమ సం పాదను దాచుకునేందుకే టీఆర్ఎ స్ను బీఆర్‌ఎ్‌సగా మార్చార ని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేస్తోందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, తదితరులు పాల్గొన్నారు.
ధర్మంవైపు నిలబడి గెలిపించాలి : రాజగోపాల్‌రెడ్డి
చండూరు: మునుగోడులో జరిగే ఉప ఎన్నికలో ధర్మంవైపు నిలబడి తనను గెలిపించాలని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. చండూరులో ఆదివారం నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజ లు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మునుగోడు ప్రజలంతా బీజేపీ వైపే ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ విచ్చలవిడిగా మద్యం షాపులు తెరిచి మహిళల పుస్తెలతాడు తెంపుతున్నాడని అన్నారు. కౌలు రైతులకు కూడా రైతుబంధు ఇవ్వాలని కోరితే నేటికీ స్పందించలేదన్నారు. అభివృద్ది సిరిసిల్ల, గజ్వేల్, సిద్ధిపేట నియోజకవర్గాలకే పరిమితమా? మునుగోడు కు ఎందుకు నిధులు ఇవ్వరని ప్రశించారు. ఈ ప్రాంతంలో సరైన విద్య, వైద్యం లేదని, తాను మూడేళ్లుగా అభివృద్ధి నిధులు అడిగినా సీఎం కనీసం స్పందించలేదన్నారు. పార్టీ మారి తే తప్ప అభివృద్ధి చేయలేరా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను గద్దె దించి, టీఆర్ఎస్ బొందపెట్టాలని, పేదల కష్టాలు పోవాలంటే మునుగోడులో కాషాయ జెండా ఎగరాలన్నారు. మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు రాష్ట్ర భవిష్యత్‌కు పునాది కావాలని, చరిత్రలో నిలిచేలా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హన్మకొండ మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, నాయకులు నాగూరావ్ నామోజి, మునిసిపల్ వైస్‌చైర్మన్ దోటి సుజాత వెంకటే్‌షయాదవ్, కౌన్సిలర్లు అనంత మంగమ్మగిరిధర్, గుంటి వెంకటేశం, కోమటి వీరేశం, మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు, అన్నెపర్తి యాదగిరి, సముద్రాల వెంకన్న, కొత్తపాటి సతీ్‌షకుమార్, అనంత చంద్రశేఖర్, భూతరాజు వేణు, చిలుకూరి అశోక్, పందుల సత్యం, కొత్త అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-17T06:02:55+05:30 IST