ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కౌలురైతు బలవన్మరణం

ABN, First Publish Date - 2022-01-21T07:18:37+05:30

తెగుళ్లవ్యాప్తిని అరికట్టేందుకు చేపట్టిన సస్యరక్షణ చర్యల ఖర్చులు, కౌలు చెల్లింపుతో రాబడి తగ్గి పెరిగిన అప్పులు కౌలు రైతును బలి తీసుకున్నాయి.

లింగయ్య (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిర్యాలగూడ అర్బన్‌, జనవరి 20: తెగుళ్లవ్యాప్తిని అరికట్టేందుకు చేపట్టిన సస్యరక్షణ చర్యల ఖర్చులు, కౌలు చెల్లింపుతో రాబడి తగ్గి పెరిగిన అప్పులు కౌలు రైతును బలి తీసుకున్నాయి. మిర్యాలగూడలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఈదులగూడకు చెందిన కట్టెబోయిన లింగయ్య(56) గత కొన్నేళ్లుగా ఏడెకరాల భూమిని కౌలుకు తీసుకొని వరి సాగుచేస్తున్నాడు. రెండేళ్లుగా ఏర్పడ్డ ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అధిక వర్షాలతో పంట దిగుబడి పడిపోయింది. గడిచిన వానాకాలం సీజన్‌లో చీడపీడల వ్యాప్తితోపాటు గత నవంబర్‌లో కురిసిన వర్షాలకు పంట నేలవాలి దిగుబడి తగ్గింది. కౌలు చెల్లింపు మినహా చేతికి చిల్లిగవ్వ దక్కలేదు. దీంతో వరిసాగుకోసం అరువుగా తెచ్చిన సొమ్మును సకాలంలో చెల్లించలేకపోవడంతో సుమారు రూ. 3లక్షల వరకు అప్పుభారం పెరిగి ఆర్థికంగా చితికిపోగా, అప్పులిచ్చిన వారి వేదింపులు పెరిగాయి. మరోవైపు ప్రస్తుత యాసంగి సీజన్‌లో ఏడు ఎకరాల్లో సాగుచేసిన పంట ఎదుగుదల ఆశించిన స్థాయిలో లేకపోవడం, రెండేళ్లుగా మిగిలిపోయిన రూ. 3లక్షల అప్పుల భారం కౌలురైతు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన కౌలు రైతు గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. ఇంటినుంచి బయటకు వెళ్లిన భార్య లింగమ్మ తిరిగొచ్చి చూడగా భర్త ఇంట్లోని ఫ్యాన్‌కు విగతజీవిగా వేలాడడం చూసి కేకలుపెడుతూ బోరున విలపించింది.  లింగయ్యకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. వారికి వివాహాలు కావడంతో ఇంట్లో భార్యాభర్తలే ఉంటున్నారు.

Updated Date - 2022-01-21T07:18:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising