కమ్మ కులస్థులు సామాజిక సేవ చేయాలి
ABN, First Publish Date - 2022-11-14T01:11:58+05:30
కమ్మ కులస్థులు సామాజిక సేవలో అగ్రస్థానంలో నిలవాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్‌రావు అన్నారు. ఆదివారం దోరకుంట శివారులోని ఎర్నేని బాబు మామిడితోటలో కోదాడ కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనభోజన మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
కోదాడ రూరల్, నవంబరు 13: కమ్మ కులస్థులు సామాజిక సేవలో అగ్రస్థానంలో నిలవాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్‌రావు అన్నారు. ఆదివారం దోరకుంట శివారులోని ఎర్నేని బాబు మామిడితోటలో కోదాడ కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనభోజన మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కమ్మ కులస్థుల్లో వెనుకబడిన వారికి ఉన్నత స్థానంలో ఉన్నవారు తోడ్పాటునందించాలని కోరారు. అనంతరం మహిళలు ఉసిరి చెట్టుకు పూజలు నిర్వహించారు. ఎస్‌వీ టెక్నో స్కూల్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, మిమిక్రీ అలరించింది. కార్యక్ర మంలో అధ్యక్షుడు ఎర్నేని వెంకటరత్నం బాబు, ఖమ్మం జిల్లా కమ్మ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్నేని రామరావు, అనంతగిరి ఎంపీపీ చుండూరు వెంకటే శ్వరరావు, జడ్పీటీసీ మందలపు కృష్ణకుమారి శేషు, తొండపు సతీష్, వైస్ ఎంపీపీ మల్లెల రాణి బ్రహ్మయ్య, దోరకుంట సర్పంచ్ ఆంధ్రజ్యోతి రవి, పీఏసీఎస్ చైర్మన్లు నలజాల శ్రీనివాస్, ముత్తవరపు రమేష్, సామినేని రమేష్, నెల్లూరు లీలావతి, కృష్ణవేని హరీష్, ఈదర సత్యనారాయణ పాల్గొన్నారు.
డుగుల
Updated Date - 2022-11-14T01:12:13+05:30 IST