ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KA Paul: టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌పై కేఏ పాల్ అనుచిత వ్యాఖ్యలు..

ABN, First Publish Date - 2022-11-03T11:33:46+05:30

నల్గొండ: టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సంస్థానారాయణపూర్‌లో టీఆర్ఎస్ నేతలు ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా పోలింగ్ బూత్‌ల లోపలకు వెళ్లారని దాంతో పోలీసులు సహకారంతో కేఏ పాల్ వాళ్లను బయటకు పంపించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఇక్కడ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. మునుగోడులో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరుగుతోందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. అయితే ఇక్కడ ప్రధాన పార్టీలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. బీజేపీ రూ. 30 వేలు ఇస్తానని చెప్పి.. రూ. 3వేలు ఇచ్చిందని, టీఆర్ఎస్ తులం బంగారం, రూ. 30 వేలు ఇస్తామని చెప్పి.. రూ. 3వేలు ఇచ్చిందని.. అలాగే కాంగ్రెస్ రూ. 15 వందలు ఇచ్చిందని ఓటర్లు పోలీస్ స్టేషన్, టీవీ చానల్లో చెబుతుంటే.. ఆ మూడు పార్టీలకు చెందిన

వాళ్లను ఎందుకు అరెస్టు చేయడం లేదని పాల్ ప్రశ్నించారు.

టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల డబ్బులు కోట్లలో దొరికాయని, వారిని ఎందుకు డిస్ క్వాలిఫై చేయడంలేదని కేఏ పాల్ ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల అభ్యర్థులను డిస్ క్వాలిఫై చేయాలని, ఆయా పార్టీల ఏజెంట్లను బయటకు పంపించాలని డిమాండ్ చేశారు. ఏది ఏమైనా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు ఈ నెల 6వ తేదీన తెలుస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కేఏ పాల్ పిలుపిచ్చారు.

Updated Date - 2022-11-03T11:33:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising