దివ్యాంగుడిపై దాడి చేసిన నిందితుడికి జైలు, జరిమానా
ABN, First Publish Date - 2022-04-27T05:08:48+05:30
మద్యం మత్తులో ఓ దివ్యాంగుడిపై దాడి చేసిన నిందితుడికి ఏడాది జైలుశిక్షతో పాటు జరిమానా విధిస్తూ నిడమనూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి పురుషోత్తమరావు మంగళవారం తీర్పు వెల్లడించారు.
నిడమనూరు, ఏప్రిల్ 26 : మద్యం మత్తులో ఓ దివ్యాంగుడిపై దాడి చేసిన నిందితుడికి ఏడాది జైలుశిక్షతో పాటు జరిమానా విధిస్తూ నిడమనూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి పురుషోత్తమరావు మంగళవారం తీర్పు వెల్లడించారు. కోర్టు లైజన్ అధికారి షేక్ అలీ అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం త్రిపురారం మండలం హర్జాతండా గ్రామానికి చెందిన ధరావత్ సేవా అనే దివ్యాంగుడిని అదే గ్రామానికి చెందిన ధరావత్ హేమ్లా మద్యం మత్తులో 2007 జూలై 2న మధ్యాహ్నం సమయంలో అకారణంగా దాడి చేసి గాయపర్చాడు. బాధితుడు సేవా త్రిపురారం పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్‌ఐ యాలాద్రి నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశాడు. కేసును మంగళవారం విచారించిన న్యాయమూర్తి నిందితుడు హేమ్లాపై నేరం రుజువుకావడంతో ఏడాది జైలుశిక్షతో పాటు రూ.రెండు వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరపున ఏపీపీ సాధన వాదనలు వినిపించారు.
అకారణంగా కొట్టిన నిందితుడికి జైలు
ఓ వ్యక్తిని అకారణంగా కొట్టిన నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ నిడమనూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి పురుషోత్తమరావు మంగళవారం తీర్పు వెల్లడించారు. కోర్టు లైజన్ అధికారి షేక్ అలీ అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం త్రిపురారం మండలం కామారెడ్డిగూడెం గ్రామానికి చెందిన రాజీవ్ యువశక్తి గ్రూపు సభ్యులు 2016 మే 20న బ్యాంకు రుణం గురించి చర్చించుకుంటుండగా గ్రూపుతో సంబంధం లేని కుంచం కోటయ్య గ్రూపు సభ్యుడైన కుంచం రాము అనే వ్యక్తిని అకారణంగా కొట్టాడు. బాధితుడు రాము అదేరోజు త్రిపురారం పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్‌ఐ యాలాద్రి నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశాడు. కేసును మంగళవారం విచారించిన న్యాయమూర్తి నిందితుడు కోటయ్యపై నేరం రుజువు కావడంతో నిందితుడికి నెల రోజుల జైలు లేదా రూ.వెయ్యి జరిమానా చెల్లించేవిధంగా తీర్పు చెప్పారు.
Updated Date - 2022-04-27T05:08:48+05:30 IST