ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్‌ పార్టీయే

ABN, First Publish Date - 2022-08-11T05:52:24+05:30

దేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేసింది, దేశాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్‌ పార్టీయేనని నల్లగొండ ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆజాదీ కా గౌరవ్‌ పాదయాత్ర మండల పరిధిలోని రాఘవాపురం క్రాస్‌రోడ్‌ నుంచి నడిగూడెం మండల కేశవాపురం వరకు బుధవారం సుమారు 12 కిలోమీటర్ల మేర కొనసాగింది.

మోతె మండల కేంద్రంలో మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆజాదీ కా గౌరవ్‌ పాదయాత్రలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 



మోతె, ఆగస్టు 9: దేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేసింది, దేశాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్‌ పార్టీయేనని నల్లగొండ ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆజాదీ కా గౌరవ్‌ పాదయాత్ర మండల పరిధిలోని రాఘవాపురం క్రాస్‌రోడ్‌ నుంచి నడిగూడెం మండల కేశవాపురం వరకు బుధవారం సుమారు 12 కిలోమీటర్ల మేర కొనసాగింది.  కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నతో కలిసి పాదయాత్ర చేశారు. దేశం కోసం కాంగ్రెస్‌ పార్టీ చేసిన అభివృద్ధి తప్ప ప్రస్తుత ప్రభుత్వాలు మోసం, దగాతో పాలన కొనసాగిస్తున్నాయన్నారు. అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు. పెట్రోల్‌, డీసీ ల్‌, గ్యాస్‌తో పాటు నిత్యావసర ధరలు పెరిగి సామాన్యులు బతకలేక పోతు న్నా రన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్‌ పార్టీ  అధికారంలోకి వస్తుందన్నారు. అనంతరం మండలకేంద్రం లోని రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించా రు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆరె లింగారెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కీసర సంతో్‌షరెడ్డి, రామసాని మంజులారెడ్డి, ముదిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, సామ వెంకట్‌రెడ్డి, వేదం హరిప్రసాద్‌, ధర్మారెడ్డి, సంజీవ, గణే్‌ష తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-11T05:52:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising