ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెద్దలను గౌరవించడం మన సంస్కృతి

ABN, First Publish Date - 2022-10-02T05:59:03+05:30

పెద్దలను గౌరవించడం మన సంస్కృతి అని, ఈ సంస్కృతిని గుర్తించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు.

సూర్యాపేటలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి జగదీష్‌రెడ్డి 

సూర్యాపేటటౌన్‌/ పెన్‌పహాడ్‌ అక్టోబరు 1: పెద్దలను గౌరవించడం మన సంస్కృతి అని, ఈ సంస్కృతిని గుర్తించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల్లో ఆయన మాట్లాడారు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల త్యాగాలు వెలకట్టలేనివని కొనియాడారు. వయోవృద్ధులు పిల్లలకు భారం కాదని, సమాజానికి గొప్ప ఆస్తి అని కొనియాడారు.  తల్లిదండ్రులు అనేక త్యాగాలకు ఒర్చి పిల్లల ఉన్నతికి కృషి చేస్తారని, అదేవిధంగా పెద్దలను పోషించాల్సిన బాధ్యత పిల్లలపై ఉందన్నారు. రాష్ట్ర ప్రజలను సీఎం కేసీఆర్‌ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని అర్హులైన వారందరికీ వివిధ రకాల పింఛన్లు అందజేస్తున్నారని తెలిపారు. కడుపులో ఉన్న బిడ్డ మొదలు పెరిగి పెద్దయ్యే వరకు ప్రతి దానిలో ప్రభుత్వ భాగస్వామ్యం ఉందన్నారు. వయెవృద్ధులే మన ఆస్తిపాస్తులని తెలిపారు. వయోవృద్ధులు సమాజానికి భారం కాదని వారి సేవలు, స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శంగా నిలవాలన్నారు. వారం రోజులుగా వయోవృద్ధులకు నిర్వహించిన క్రీడల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం వయోవృద్ధులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి జ్యోతిపద్మ, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ, కౌన్సిలర్‌ తాహిర్‌పాషా, నాయకులు సవరాల సత్యనారాయణ, రాంచంద్రారెడ్డి, సీతారామశాస్ర్తి, హమీద్‌ఖాన్‌, నీలకంఠ చలమంద, విద్యాసాగర్‌ తదితరులు పాల్గొన్నారు. పెన్‌పహాడ్‌మండలంలోని అనంతారం గ్రామంలో జడ్పీ టీసీ మామిడిఅనిత మామ చిన్న వెంకులు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు.ఆయన వెంట ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ మామిడి అనిత, మాజీ వైస్‌ ఎంపీపీ మామిడి వెంకటయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు అంజయ్య, నారాయణరెడ్డి, గుగ్గిళ్ల సోమయ్య, కట్ల నాగార్జున ఉన్నారు. 

Updated Date - 2022-10-02T05:59:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising