అమరేందర్‌రెడ్డి కోఆర్డినేటర్‌గా కొనసాగడం సరికాదు
ABN, First Publish Date - 2022-12-16T01:02:06+05:30
మిర్యాలగూడ నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి కొనసాగడం సరికాదని డీసీసీ ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు అన్నారు.
మిర్యాలగూడ, డిసెంబరు 15: మిర్యాలగూడ నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి కొనసాగడం సరికాదని డీసీసీ ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు అన్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీసీసీ అధ్యక్షు డిగా ఉన్నప్పుడు అమరేందర్‌రెడ్డిని ఎలక్షన్ కోఆర్డినేటర్‌గా నియమిం చారని, అప్పుడు ఇచ్చిన పత్రాన్ని ఉంచుకొని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జినని చెప్పకోవడం కార్యకర్తలను అయోమయానికి గురిచే యడమేనన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ, అనేక సేవా కార్య క్రమాలు చేస్తూ ప్రజలకు అండగా నిలబడి పార్టీని పటిష్టంగా కాపా డుకుంటూ వస్తుండగా, అమరేందర్‌రెడ్డి ఈ విధంగా వ్యవహరించ డం సబబుగా లేదన్నారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి శంకర్ నాయక్‌ల ప్రమేయం లేకుండా కోఆర్డినేటర్‌గా ఎలా కొనసాగు తారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు దేశిడి శేఖర్‌రెడ్డి, జానిభాయ్, రవినాయక్, రామకృష్ణ, నాగలక్ష్మి, మోయిజ్, సిద్దూనా యక్, గౌస్‌భాయ్, అబ్దుల్లా చల్లా వెంకన్న, ఇమ్రాన్ ఉన్నారు.
Updated Date - 2022-12-16T01:02:09+05:30 IST