ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చర్లగూడెం రిజర్వాయర్‌ పనుల అడ్డగింత

ABN, First Publish Date - 2022-01-22T06:01:29+05:30

డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా మ ర్రిగూడ మండలం చర్లగూడెంలో రి జర్వాయర్‌ నిర్మాణ పనులను భూనిర్వాసితులు శుక్రవారం అడ్డుకున్నా రు.

రిజర్వాయర్‌ వద్ద పనులను అడ్డుకుంటున్న నిర్వాసితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 భూపరిహారం, పునరావాసం కల్పించాకే చేపట్టాలని డిమాండ్‌

మర్రిగూడ, జనవరి 21: డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా మ ర్రిగూడ మండలం చర్లగూడెంలో రి జర్వాయర్‌ నిర్మాణ పనులను భూనిర్వాసితులు శుక్రవారం అడ్డుకున్నా రు. కాంట్రాక్టర్లు యంత్రాలతో పను లు నిర్వహిస్తుండగా సమాచారం తెలుసుకుని పనులు నిలిపివేశారు. పునరావాసం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్రత్యేక ప్యాకేజీ పూర్తిస్థాయిలో అందించి రిజర్వాయర్‌ నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. చర్లగూడెం రిజర్వాయర్‌ నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవుతున్న నర్సిరెడ్డిగూడెం వాసులు 70 రోజులు గా చర్లగూడెం రిజర్వాయర్‌ ప్రతిపాదిత స్థలం వద్ద టెంట్‌ వేసుకొని ఆందోళన కొనసాగిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు టెంట్‌ సామగ్రిని అపహరించుకుపోవటం, సంక్రాంతి పండగ నేపథ్యంలో భూనిర్వాసితులు కొన్ని రోజులపాటు ధర్నాను వాయిదా వేసుకున్నారు. ఇదే అదునుగా భావించిన కాంట్రాక్టర్‌ రెం డు రోజుల నుంచి చర్లగూడెం రిజర్వాయర్‌ కట్ట నిర్మాణ పనులను అధికారుల ప్రమే యం లేకుండా నిర్వహిస్తున్నారు. పనులు నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న భూ నిర్వాసితులు అక్కడికి చేరుకుని కాంట్రాక్టర్‌ను నిలదీశారు. ప్రభుత్వం అందించాల్సిన పరిహారం, పునరావాసం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వకుండా, అధికారులు ఎలాంటి స మాచారం ఇవ్వకుండా రిజర్వాయర్‌ పనులు చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పరిహారం, పునరావాసం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇచ్చేంతవరకు పనుల ను అడ్డుకుంటామని ముంపు గ్రామ బాధితులు లోడే యాదయ్య, వెంకటయ్య, యే సోబు, కుక్కల వెంకట్‌, నర్సింహతోపాటు పలువురు తేల్చిచెప్పటంతో నిర్వాహకులు యంత్రాలను వెనక్కు మళ్లించారు. దీంతో భూనిర్వాసితులు తమ ఇళ్లకు వెళ్లారు.

Updated Date - 2022-01-22T06:01:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising