ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైజ్ఞానిక ప్రదర్శనతో మేధాశక్తి పెంపొందుతుంది

ABN, First Publish Date - 2022-12-07T23:34:56+05:30

విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థుల మేధాశక్తి పెంపొందుతుందని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఏవీఎం పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్‌ ఫెయిర్‌ ముగింపు కార్యక్రమంలో డీఈవో అశోక్‌తో కలసి పాల్గొన్నారు.

విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న మునిసిపల్‌ చైర్‌పర్సన అన్నపూర్ణ, డీఈవో అశోక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేటఅర్బన్‌, డిసెంబరు 7 : విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థుల మేధాశక్తి పెంపొందుతుందని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఏవీఎం పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్‌ ఫెయిర్‌ ముగింపు కార్యక్రమంలో డీఈవో అశోక్‌తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు రోజులుగా సదస్సును విద్యాశాఖ విజయవంతంగా నిర్వహిస్తోందని అభినందించారు. జిల్లాలోని 23 మండలాల పాఠశాలల నుంచి 518 ప్రదర్శనలు వచ్చాయన్నారు. విద్యార్థులు విజయవంతంగా ప్రదర్శించారని వివరించారు. ప్లాస్టిక్‌ రహిత ప్రదర్శనలు 80 శాతం వచ్చాయని, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయుల కృషి వెలకట్టలేమని, సైన్స్‌ఫెయిర్‌ను విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, పట్టణ ప్రజలు తిలకించారన్నారు. ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన వారి ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు పంపిస్తామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రాష్ట్రస్థాయికి 14, ఇనస్పైర్‌ మనక్‌కు నలుగురి విద్యార్థుల ప్రాజెక్టులు ఎంపికైనట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్‌ అధికారి దేవరాజ్‌, ఏడీ శైలజ, పట్టణ ప్రముఖులు మీలా వాసుదేవ్‌, మీలా మహదేవ్‌, ఎంఈవోలు రవి, గోపాల్‌రావు, ఉపాధ్యాయులు ఎల్లయ్య, శ్రీనయ్య, దారం శ్రీనివాస్‌, అంగిరేకుల రాజశ్రీ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:34:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising