వారసత్వ భూమి వేరేవారికి పట్టా చేశారు
ABN, First Publish Date - 2022-12-16T01:00:07+05:30
తమకు రావల్సిన వారసత్వ భూమిని తహసీ ల్దార్ వేరేవారికి పట్టా చేశారని ఆరోపిస్తూ బాధితులు పె ట్రోల్ బాటిల్‌తో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి ఆందోళన చేశారు.
డిండి, డిసెంబరు 15: తమకు రావల్సిన వారసత్వ భూమిని తహసీ ల్దార్ వేరేవారికి పట్టా చేశారని ఆరోపిస్తూ బాధితులు పె ట్రోల్ బాటిల్‌తో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి ఆందోళన చేశారు. నల్లగొండ జిల్లా డిండి తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ఈ సంఘటన జరిగింది. డిండి మండలంలోని గోనకోలు గ్రామానికి చెందిన శ్రీపతి లక్ష్మారెడ్డికి సర్వే నెంబర్ 77లో మూడు ఎకరాల 16 గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని లక్ష్మారెడ్డి తన కుమారులు నాగిరెడ్డికి ఒక ఎకరం, మాధ వరెడ్డికి ఒక ఎకరం పట్టా చేశాడు. పెద్ద కుమారుడైన శ్రీపతి కృష్ణారెడ్డికి ఒక ఎకరం 16గుంటల భూమి వాటాగా వచ్చింది. ఆ భూమిని తన పేరున చేయించుకోకపోవడంతో రికార్డుల్లో లక్ష్మారెడ్డి పేరునే ఉంది. లక్ష్మారెడ్డి, అతని ముగ్గురు కుమారులూ మృతిచెందారు. గోనకోలు గ్రామానికి వీఆర్‌వోగా పనిచేస్తున్న ఓ ఉద్యోగి 2018 సంవత్సరంలో లక్ష్మారెడ్డి పేరున రికార్డుల్లో ఉన్న ఒక ఎకరం 16గుంటల భూమిని అతని సోదరుడి కు మార్తె నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలం శిరుసనగండ్ల గ్రామానికి చెందిన ఎన్.మంజుల పేరిట రికార్డుల్లో ఎక్కించి పట్టా చేశాడు. ఇదే భూమిని తన అక్క సైదమ్మ అల్లుడైన సురేందర్‌రెడ్డికి మంజుల విక్రయిం చింది. తమకు వారసత్వంగా వచ్చే భూమిని ఇతరుల పేరుపై మార్చ డాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ 2022 అక్టోబరు 1వ తేదీన కృష్ణారెడ్డి వారసులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును బేఖాతరు చేసిన తహసీల్దార్ అక్టోబరు 15న సర్వేనెంబర్ 77లోని ఒక ఎకరం 16 గుంటల భూమిని జనగామకు చెందిన సురేందర్‌రెడ్డికి పట్టా చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. దీంతో శ్రీపతి కృష్ణారెడ్డి వారసులు శ్రీపతి నాగార్జునరెడ్డి, శ్రీపతి అరవింద్‌రెడ్డి, శ్రీపతి నరేష్‌రెడ్డి, శ్రీపతి విష్ణువర్ధన్‌రెడ్డి, శ్రీపతి ఇంద్రారెడ్డి, శ్రీపతి జైపా ల్‌రెడ్డి పెట్రోల్ బాటిల్‌తో గురువారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చా రు. భూమిని తమ పేరున చేయని పక్షంలో పెట్రోల్ పోసుకొని కాల్చుకుం టామని తహసీల్దార్ చాంబర్ ఎదుట పెట్రోల్ బాటిల్‌తో కూర్చున్నారు. తమకు రావలసిన భూమిని ఇతరులకు అక్రమంగా పట్టా చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో తహసీల్దార్ ప్రశాంత్‌రావు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆందోళన చేస్తున్న వారికి పోలీసులు నచ్చజెప్పారు. ఈ విషయమై తహసీల్దార్‌ను వివరణ కోరగా, రికార్డులు పరిశీలించి సమస్యను ఉన్నత అధికారులకు వివరించి న్యాయం చేస్తామని తెలిపారు.
Updated Date - 2022-12-16T01:00:10+05:30 IST