ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెంచిన వాహనాల పన్నులను తగ్గించాలి

ABN, First Publish Date - 2022-05-18T07:21:44+05:30

పెంచిన వాహనాల పన్నులను తగ్గించాలని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు కనగాల నాగేశ్వరరావు కోరారు.

కోదాడలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మను దహనం చేస్తున్న లారీ ఓనర్స్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోదాడ టౌన్‌, మే 17: పెంచిన వాహనాల పన్నులను తగ్గించాలని  లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు కనగాల నాగేశ్వరరావు కోరారు. మంగళవారం రవాణా రంగ జేఏసీ ఆధ్వర్యంలో కోదాడలోని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ కార్యాలయం ఎదురుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌, ధరలు, బీమా ప్రీమియం, గీన్‌ ట్యాక్స్‌, పోలీసుల ఈ చలానాలతో తాము తీవ్రంగా నష్టపోతున్నా మన్నారు.  పెంచిన ధరలను తగ్గించాలనే వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పైడి మర్రి వెంకటనారాయణ, విలాసకవి నర్సరాజు, పెద్ది అంజ్య, గౌస్‌, అప్పన్న, నాగేశ్వరరావు, అంజి, అశోక్‌, పాల్గొన్నారు. 

ప్రభుత్వాల దిష్టిబొమ్మ దహనం 

హుజూర్‌నగర్‌  రూరల్‌: పట్టణంలోని కోదాడ రోడ్డులో లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను  దహ నం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.కార్యక్రమంలో కౌన్సిలర్‌ కోతి సంపత్‌రెడ్డి, రామిశెట్టి శ్రీను, శంకర్‌రావు, శ్రీనివాసరాజు,రవి, సత్యనారాయణ, మంచాల శ్రీను, బుల్లెట్‌ శ్రీను, నవీన్‌, శేఖర్‌రెడ్డి, ఆలీ, చందు, రవి, వీరబాబు, షేక్‌ సైదా పాల్గొన్నారు.


Updated Date - 2022-05-18T07:21:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising