ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు అప్పగించాలి : సీపీఎం

ABN, First Publish Date - 2022-05-26T06:55:36+05:30

మండలంలోని కొంపెల్లి గతం లో పేదల కోసం సేకరించిన ఇళ్ల స్థలాలను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సీపీఎం మండల కార్యదర్శి కొర్ర శంకర్‌నాయక్‌ డిమాండ్‌ చేశారు.

తహసీల్దార్‌కు వినతిపత్రం అందచేస్తున్న కొంపెల్లి గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమలగిరి(సాగర్‌), మే 25: మండలంలోని కొంపెల్లి గతం లో పేదల కోసం సేకరించిన ఇళ్ల స్థలాలను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సీపీఎం మండల కార్యదర్శి కొర్ర శంకర్‌నాయక్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం కొంపెల్లి గ్రామానికి చెందిన పలువురితో కలిసి ఆయన తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేసి మా ట్లాడారు. 2004 సంవత్సరంలో కొంపెల్లి గ్రామంలోని సర్వే నెం.261 లో పేదల ఇళ్ల నిర్మాణానికి ఐదెకరాల భూమిని సేకరించినట్లు తెలిపారు. అయితే పలు కారణాలతో అప్పటి నుంచి సేకరించిన భూ మిలో ఇళ్ల స్థలాలను లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా నిలిపి వే సినట్లు ఆరోపించారు. కొన్నేళ్లుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సేకరించిన భూమిని లబ్ధిదారులకు ఇవ్వకుండా ప్రభుత్వ పథకాలైన నర్సరీ, పా ర్క్‌, ఆట స్థలాలకు కేటాయించేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపిం చారు. ఆ స్థలాల్లోనే పేదలు కొంతమంది తాత్కాలికంగా ఇళ్లను నిర్మించుకొని కబ్జాలో ఉంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం, అధికారులు తక్షణమే సేకరించిన భూమిని అర్హులైన పేదలకు ఇళ్ల ప ట్టాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర ఉ పాధ్యక్షుడు జంగాల భిక్షం, ప్రసాద్‌, సైదులు, రమణ, రాణి, మేర మ్మ, మంగమ్మ, అన్వర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-26T06:55:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising