ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేధింపులు మానుకోవాలి

ABN, First Publish Date - 2022-04-17T05:41:35+05:30

నిరాధార ఆరోపణలతో ఎంపీడీవో పంచాయతీ కార్యదర్శులను వేధించడం మానుకోవాలని గ్రామ కార్యదర్శుల సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు చౌగాని రామయ్య, కో డిరెక్క శైలజ డిమాండ్‌ చేశారు.

ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న కార్యదర్శులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంపీడీవో కార్యాలయం ఎదుట కార్యదర్శుల ధర్నా

మిర్యాలగూడ, ఏప్రిల్‌ 16: నిరాధార ఆరోపణలతో ఎంపీడీవో పంచాయతీ కార్యదర్శులను వేధించడం మానుకోవాలని గ్రామ కార్యదర్శుల సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు చౌగాని రామయ్య, కో డిరెక్క శైలజ డిమాండ్‌ చేశారు. శనివారం ఎంపీడీవో వైఖరికి నిరసి స్తూ కార్యాలయం ఎదుట మండల కార్యదర్శులు ధర్నా నిర్వహించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల అవంతీపురం కా ర్యదర్శి మదనమోహనపై కొందరు వాట్సా్‌పలో చేసిన నిరాధార ఆరోపణలు చూపి సస్పెండ్‌ చేయటం సరికాదని అన్నారు. ఎలాంటి ఆరోపణలు లేకున్నా మరో ఆరుగురిపై వేటు వేస్తామని ప్రచారం చేయ డంతో భయాందోళనలకు గురవుతున్నట్లు తెలిపారు. కార్యదర్శులపై వచ్చిన అభియోగాలపై నోటీసులు జారీ చేయకుండానే సదరు అధికారుల నుంచి వివరణ తీసుకోకుండా సస్పెండ్‌ చేయడం, వేధించడం మానుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే మూకుమ్మడిగా ఇతర మండలాలకు బదిలీ చేయాలని కోరారు. ఈ విషయమై ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్లగా ఆయన అందుబాటులో లేకపోవడంతో కార్యాలయంలో ఫిర్యాదు అందజేశారు. కార్యక్రమంలో కార్యదర్శుల సంఘం గౌరవాధ్యక్షుడు మాధవరెడ్డి, మదనమోహన, మండల పరిధిలోని కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-04-17T05:41:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising