కోమటిరెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ
ABN, First Publish Date - 2022-05-24T07:45:39+05:30
భువనగిరి ఎంపీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను సోమవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.
భువనగిరి రూరల్, ఆలేరు రూరల్, మే 23: భువనగిరి ఎంపీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను సోమవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. భువనగిరిలో ఎంపీకి డీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి పచ్చిమట్ల శివరాజ్‌గౌడ్ శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రావి కిరణ్ రెడ్డి, గుండాల సత్యనారాయణ తదితరులున్నారు. ఆలేరు నాయకులు ఎంపీ కోమటిరెడ్డిని హైదరాబా ద్లో పలువురు ప్రముఖులు కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, కల్లూరి రాంచంద్రారెడ్డి, నీలం పద్మ, కర్రె నరేష్, సురేష్‌గౌడ్, అజయ్, మహేష్, బాలకృష్ణ, రవితేజ పాల్గొన్నారు.
భువనగిరి టౌన్: పట్టణంలో వేర్వేరుగా నిర్వహించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో కాంగ్రెస్ మునిసిపల్ కఫ్లోర్ లీడర్ పత్నక్ ప్రమోద్‌కుమార్, మాజీ చైర్మన్ బర్రె హంగీర్, జిట్ట మల్లారెడ్డి, కైరంకొండ వెంకటేష్, ఈరపాక నర్సింహ, పడిగెల రేణుకా ప్రదీప్, నజీమా సల్లాఉద్దీన్, షేక్మజర్ పాషా తదితరులు పాల్గొన్నారు
మోత్కూరు:ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మోత్కూరులోనిఅంబేడ్కర్ చౌరస్తాలో కేక్ కట్‌చేశారు. అనంతరం శారదా క్లినిక్‌లో రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుండగోని రామచంద్రు, జిల్లా నాయకులు డాక్టర్ జి.లక్ష్మీనర్సింహారెడ్డి, ఎండీ అయాజ్, కుకునూరి జ్యోతి విష్ణువర్ధన్ రెడ్డి, లెంకల వేణు, పురుగుల నర్సింహ, తండ సత్తయ్య, కారుపోతుల వెంకన్న, పన్నాల శ్రీనివాస్‌రెడ్డి, మెంట సురేష్, పి.అంజయ్య, రమేష్, బుర్ర నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-05-24T07:45:39+05:30 IST