ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేనేతపై జీఎస్టీని ఎత్తేయాలి

ABN, First Publish Date - 2022-01-29T06:14:24+05:30

చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలని ఎమ్మెల్సీ ఎల్‌.రమణ డిమాండ్‌ చేశారు. చేనేతకు జీరో జీఎస్టీ అమలుకోసం అఖిల భారత పద్మశాలి సంఘం పిలుపు మేరకు ప్రధాని నరేంద్రమోదీ, ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్‌కు లక్ష పోస్టుకార్డుల ఉద్యమా న్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు.

పోచంపల్లి సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ ఎల్‌.రమణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్సీ ఎల్‌.రమణ


భూదాన్‌పోచంపల్లి, జనవరి 28: చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలని ఎమ్మెల్సీ ఎల్‌.రమణ డిమాండ్‌ చేశారు. చేనేతకు జీరో జీఎస్టీ అమలుకోసం అఖిల భారత పద్మశాలి సంఘం పిలుపు మేరకు ప్రధాని నరేంద్రమోదీ, ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్‌కు లక్ష పోస్టుకార్డుల ఉద్యమా న్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చేనేతపై జీరో జీఎస్టీ కోసం చేపట్టిన ఉద్య మం ఆరంభం మాత్రమేనని, ఇది అంతం కాదన్నారు. చేనేత రంగ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం కోసం రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలను కలిసి మద్దతు కూడగట్టి, ఢిల్లీలో ఉద్యమిస్తామన్నారు. అఖిల పక్షం చేనేత నా యకులు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగాన్ని పరిరక్షించాలని డిమాండ్‌ చేశారు. ముందుగా ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చేనేత టైఅండ్‌డై అసోసియేషన్‌ అధ్యక్షుడు తడక రమేష్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, పలు చేనేత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-29T06:14:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising