ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధిని మరిచిన ప్రభుత్వాలు : రంగారెడ్డి

ABN, First Publish Date - 2022-07-02T06:45:13+05:30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధిని మరిచి అధికారం చెలాయిస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిర్యాలగూడ, జూలై 1: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధిని మరిచి అధికారం చెలాయిస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. శుక్రవారం పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సంక్షేమాన్ని వదిలి పాలకులు అధికారం కోసమే పాకులాడుతున్నాయని విమర్శించారు. కేంద్రం సీఎంఆర్‌ బియ్యాన్ని తీసుకోక పోవడం వల్ల సుమారు 2 లక్షల మంది హమాలీలు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 1500కు పైగా రైస్‌మిల్లులు మూతపడ్డాయన్నారు. సీఎంఆర్‌ బియ్యాన్ని కొనుగోలు చేసి రైస్‌మిల్లులను తెరిపించాలన్నారు. వానాకాలం సీజనలో డీలర్లు రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బీకార్‌ మల్లేష్‌, నాయకులు మల్లు గౌతంరెడ్డి, బావాండ్ల పాండు, తిరుపతి రంమూర్తి, రాగిరెడ్డి మంగారెడ్డి, పరశురాములు, ల క్ష్మీనారాయణ, అంజద్‌, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2022-07-02T06:45:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising