ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రభుత్వాలు

ABN, First Publish Date - 2022-03-05T06:50:01+05:30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ నారాయణ అన్నారు. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే పల్లా పర్వత్‌రెడ్డి 25వ వర్ధంతిని పురస్కరించుకుని దేవరకొండలోని ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం నిర్వహించిన సభలో ఆయ న మాట్లాడారు.

దేవరకొండలో జరిగిన పల్లా పర్వత్‌రెడ్డి వర్థంతి సభలో మాట్లాడుతున్న డాక్టర్‌ నారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ నారాయణ


 దేవరకొండ, మార్చి 4 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ నారాయణ అన్నారు.  దేవరకొండ మాజీ ఎమ్మెల్యే పల్లా పర్వత్‌రెడ్డి 25వ వర్ధంతిని పురస్కరించుకుని దేవరకొండలోని ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం నిర్వహించిన సభలో ఆయ న మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాత పల్లా పర్వత్‌రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పర్వత్‌రెడ్డి దేవరకొండ ప్రాంత అభివృద్ధికి కృషి చేశాడన్నారు. దేవరకొండ ప్రాంతానికి కృష్ణాజలాలు అందించాలని ఉద్యమాలు చేసిన ఘనత పర్వత్‌రెడ్డికే దక్కిందన్నారు. దేశంలో కొత్తగా దేవుడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ భూస్వాముల ఆధీనంలోని ప్రభుత్వ భూములను పేదలకు పంచిన ఘనత పర్వత్‌రెడ్డికే దక్కిందన్నారు. పేదల పక్షాన సీపీఐ నిరంతరం పోరాటాలు నిర్వహిస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గంలో పెండింగ్‌లోని ఎస్‌ఎల్‌బీసీ, శ్రీశైలం సొరంగమార్గం, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయాలన్నారు. సభలో నాయకులు పల్లా నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, నెల్లికంటి సత్యం, కె.శ్రీనివా్‌సరెడ్డి, ప్రతా్‌పరెడ్డి, రత్నాకర్‌రావు, ఆదిరెడ్డి, నర్సింహ, అంజయ్యనాయక్‌, దేవేందర్‌రెడ్డి మాట్లాడారు.

Updated Date - 2022-03-05T06:50:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising