ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వం వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2022-08-04T05:54:59+05:30

వీఆర్‌ఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్‌ చేశారు.

మునుగోడులో వీఆర్‌ఏలకు మద్దతు తెలుపుతున్న కాంగ్రెస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మర్రిగూడ/ దామరచర్ల/ మిర్యాలగూడ/ కట్టంగూర్‌/ మునుగోడు/ కనగల్‌, ఆగస్టు 3: వీఆర్‌ఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించాలని జిల్లా వ్యాప్తంగా వీఆర్‌ఏలు చేపట్టిన సమ్మెకు వారు బుధవారం మద్దతు తెలిపా రు. మర్రిగూడ తహసీల్దార్‌ కార్యాల యం ఎదుట వీఆర్‌ఏలు చేస్తున్న నిరహరదీక్ష దీక్షలకు టీడీపీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి జక్కలి ఐలయ్య సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు దోమల వెంకటయ్య, పగడాల లింగయ్య, పుప్పాల యాదయ్య, అయ్యప్ప, అంజయ్య, ఈద కృష్ణ, వేణుగోపాల్‌, జయందర్‌ పాల్గొన్నారు. దామరచర్లలో వీఆర్‌ఏల సమ్మెకు సీపీఎం మండల ప్రధాన కార్యదర్శి వినోద్‌నాయక్‌ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో పాపానాయక్‌, భూక్య విజయ్‌, వీఆర్‌ఏ లు నాగయ్య, పల్లా ప్రవీణ్‌ పాల్గొన్నారు. మిర్యాలగూడ తహసీల్దార్‌ కార్యా లయం ఎదట వీఆర్‌ఏల సమ్మె శిబిరాన్ని జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షు రాలు గోపగాని మాధవి సంఘీభావాన్ని తెలిపారు. పే స్కేల్‌ అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్‌ మాట ఇచ్చి వీఆర్‌ఏలను ఏమా ర్చారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మహిళా నేత లు స్వరాజ్యలక్ష్మి, పద్మ, లలిత, సోమమ్మ, యాదమ్మ, వినోద, బొడ్డుపద్మ,  వీఆర్‌ఏలు సైదులు, బాషా, సురేష్‌, నాగరాజు, ముని, సలీమా, సరితా, పావని, అమీర్‌ పా ల్గొన్నారు. కట్టంగూర్‌లోని వీఆర్‌ఏల నిరవధిక సమ్మె శిబి రాన్ని టీపీసీసీ కార్యదర్శి దైద రవీందర్‌ సందర్శించి సంఘీభావం తెలిపారు. కార్య క్రమంలో నాయకులు పెద్ది సుక్కయ్య, రెడ్డిపల్లి సాగర్‌, పెద్ది బాలనర్సిం హ్మాగౌడ్‌, మహేశ్వరం నాగేశ్‌, చింత వెంకటనర్సయ్య, కొంపెల్లి యాదయ్య, రెడ్డిపల్లి పాల్గొన్నారు. మునుగోడులో వీఆర్‌ఏల నిరవధిక సమ్మెకు టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాష్‌నేత, టీపీసీసీ కార్యదర్శి పటేల్‌ రమేష్‌రెడ్డి, డీసీసీ చైర్మన్‌ శంకర్‌నాయక్‌ మద్దతు తెలిపారు. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద వీఆర్‌ఏల నిరవధిక సమ్మెలో ఆపార్టీ నేతలు పాల్వాయి స్రవంతిరెడ్డి, పల్లె రవికుమార్‌, గుమ్ముల మోహన్‌రెడ్డిలో కలిసి పాల్గొని తమ పార్టీ తరుపున సంపూర్ణ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పాల్వాయి చెన్నారెడ్డి నూర్‌మహ్మద్‌, వెంకన్న, మధుకర్‌ పాల్గొన్నారు. కనగల్‌ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద వీఆర్‌ఏలు వంటా వార్పు చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌ఏల జేఏసీ మండలధ్యక్షుడు గనిపెల్లి వెంకన్న, వీఆర్‌ఏలు విజయ్‌ కుమార్‌, శంకర్‌, రామక్రిష్ణ, ఇంద్రయ్య, నక్క సైదులు, శైలజ, లింగయ్య, రాంబాబు, రవీందర్‌, నరేందర్‌, కాశయ్య, పెద్దులు, రామలింగం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-04T05:54:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising