దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే భగత్
ABN, First Publish Date - 2022-12-16T01:04:51+05:30
దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు.
హాలియా, డిసెంబరు 15: దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. అనుముల మండలం మారేపల్లి గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభు త్వం రూ.50లక్షలు కేటాయించడంతో పనులకు గురువారం భూమి పూజ చేశారు. అభివృద్ధి పనుల వివరాలను ఆలయ కమిటీ నిర్వహ కులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరి గి పెద్దులు, ఆలయ చైర్మన్ గాడిద శ్రీకాంత్, కూరాకుల వెంకటేశ్వర్లు మాలే అరుణ, వెంపటి శంకరయ్య, వెంకన్నయాదవ్, ఎన్నమల్ల సత్య, మట్టపల్లి వెంకన్న, మనుపడి నీలమ్మకొండల్, ధర్మరెడ్డి, కూరాకుల రామయ్య, బొక్కని విజయ్, మజ్జిగపు వెంకట్‌రాంరెడ్డి, చెదురుబెల్లి రాములు, రవీందర్‌రెడ్డి, నరేందర్‌రావు పాల్గొన్నారు. అదేవిధంగా అనుముల మండలం పులిమామిడి గ్రామానికి చెందిన లబ్ధిదారుడికి మంజూరైన సీఏం సహాయ నిధి చెక్కును ఎమ్మెల్యే అందజేశారు.
Updated Date - 2022-12-16T01:04:53+05:30 IST