ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వానివి ఉత్తి మాటలే

ABN, First Publish Date - 2022-10-01T06:13:45+05:30

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసే ప్రకటనలకు, చేతలకు తేడా ఉందని, ఇది ఉత్తి మాటల ప్రభుత్వమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

మునుగోడులో మార్నింగ్‌ వాక్‌ చేస్తున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మునుగోడులో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మార్నింగ్‌ వాక్‌

మునుగోడు, సెప్టెంబరు 30: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసే ప్రకటనలకు, చేతలకు తేడా ఉందని, ఇది ఉత్తి మాటల ప్రభుత్వమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. రెండో విడత రాజ్యాధికార యాత్ర సంస్థాన్‌నారాయణపురంలో గురువారం రాత్రి నిర్వహించి మునుగోడులో బస చేశారు. శుక్రవారం తెల్లవారుజామున చండూరు వైపున ఉన్న ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారిపై మా ర్నింగ్‌ వాక్‌ చేశారు. ఈ సందర్భంగా అసంపూర్తిగా ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడి పరిసరాల్లో మద్యం సీసాలు, వ్యర్థాలతో అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించారు. 2017లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేసి నేటికీ పూర్తిచేయకపోడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. ఐదేళ్లుగా అసంపూర్తిగా ఉన్న ఈ భవనం మందు బాబులకు అడ్డాగా మారిందన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నట్లు ప్రకటించిన ప్రభు త్వం గొప్పలు చెప్పిన ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అనంతరం స్థానిక చౌరస్తాలో ప్రజలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సర్పంచ్‌ మిర్యాల వెంకన్నతో కలిసి టీతాగారు. ఆయన వెంట బీఎస్పీ నాయకులు హరీష్‌, సురే్‌షకుమార్‌ ఉన్నారు.

Updated Date - 2022-10-01T06:13:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising