ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూసీ నీటిని శుద్ధి చేయడంలో ప్రభుత్వ వైఫల్యం

ABN, First Publish Date - 2022-07-02T06:03:34+05:30

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూసీనదిని శుద్ధిచేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు ఆరోపించారు.

సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు సీతారాములు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు

 వలిగొండ, జూలై 1: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూసీనదిని శుద్ధిచేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు ఆరోపించారు. మండల కేంద్రంలో జిల్లా కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా సీతారాములు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాకముందు ఎన్నికల వాగ్ధానాల్లో మూసీ కాలుష్యాన్ని అరికడతానని హామీ ఇచ్చి, తీరా అధికారం చేపట్టాక ఇచ్చిన హామీని మరిచిపోయిందన్నారు. అసెంబ్లీ బడ్జెట్‌లో రూ.16,600కోట్లు  మూసీ ప్రక్షాళనకు కేటాయించి, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. మూసీ కాలుష్య నియంత్రణ మండలి ఉన్నా పేరుకుమాత్రమే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. కమీషన్ల కోసం ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నా, మూసీ నీటిని శుద్ధి చేయడానికి  నిధులు కేటాయించడం లేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 మురికి నీటి శుద్ధి కేంద్రాలు ఉన్నా కేవలం ఐదు మాత్రమే పని చేస్తున్నాయని, మూసీ కాలుష్యానికి ప్రధానంగా ఫార్మా కంపెనీలు విడుదల చేసే కాలుష్యమే కారణమని అన్నారు.  సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు భట్టుపల్లి అనురాధ, కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నర్సింహులు, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దోనూరు నర్సిరెడ్డి, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు, మేక అశోక్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు సిరిపంగి స్వామి, దయ్యాల నర్సింహ, మాయ కృష్ణ, బొల్లు యాదగిరి, మద్దెల రాజయ్య పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-02T06:03:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising