ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవుడా మాకు దిక్కెవరు

ABN, First Publish Date - 2022-05-30T06:14:46+05:30

రథాన్ని గుట్ట నుంచి కిందకు దించుతూ నాంపల్లి మండలం కేతేపల్లిలో విద్యుదాఘాతంతో ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబ సభ్యుల

కేతేపల్లిలో మృతుల అంతిమ యాత్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యుదాఘాతంతో మృతి చెందిన కుటుంబసభ్యుల రోదనలు 

గుర్రంపోడు, మే 29 : రథాన్ని గుట్ట నుంచి కిందకు దించుతూ నాంపల్లి మండలం కేతేపల్లిలో విద్యుదాఘాతంతో ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబ సభ్యుల రోదనలు ఆదివారం మిన్నంటాయి. మృతులకు నాంపల్లి మండలం కేతేపల్లితో పాటు గుర్రంపోడు మండలం మక్కపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. తమకు దిక్కెవరంటూ మృతులు మోహనయ్య, యాదయ్య, ఆంజనేయులు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.మేం ఎలా బతికేది అంటూ రోదించిన తీరు కంటతడిపెట్టించింది. 

మృతుల కుటుంబాలకు పరామర్శ

విద్యుదాఘాతంతో మృతి చెందిన నాంపల్లి మండలం కేతేపల్లికి చెందిన రాజబోయిన యాదయ్య, పొగాకు మోహనయ్యల కుటుంబాలను నాయకులు పరామర్శించి ఆర్థికసహాయం అందజేశారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల ఆర్థికసహాయం ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చెక్కును అందజేశారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు కర్నాటి విద్యాసాగర్‌ ఒక్కో కుటుంబానికి రూ.లక్షా 10వేల ఆర్థిక సాయం అందజేశారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి రూ.20వేల నగదు అందజేసి రూ.లక్షను రెండు, మూడు రోజులలో అందిస్తానని హమీఇచ్చారు. మునుగోడు జడ్పీటీసీ భర్త నారాబోయిన రవి ఒక్కో కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సహాయం అందజేశారు. 



Updated Date - 2022-05-30T06:14:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising