ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా పవళింపు సేవ కార్యక్రమం

ABN, First Publish Date - 2022-05-20T05:53:30+05:30

మట్టపల్లి శ్రీలక్ష్మీనృసింహుడి క్షేత్రంలో ఐదురోజులుగా జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి కన్నుల పండువగా నిర్వహించిన పవళింపు సేవ కార్యక్రమంతో ముగిశాయి.

పూలమాలల మధ్య స్వామి వారి పవళింపు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మఠంపల్లి, మే 19 : మట్టపల్లి శ్రీలక్ష్మీనృసింహుడి క్షేత్రంలో ఐదురోజులుగా జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి కన్నుల పండువగా నిర్వహించిన పవళింపు సేవ కార్యక్రమంతో ముగిశాయి. ఉదయం క్షేత్రంలో పుణ్యహవాచనం, సహస్రనామార్చనలు, నీరాజనమంత్రపుష్పం, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం ఆరు గంటలకు స్వామివారికి ద్వాదశసేవలు, శృంగార డోలోత్సవం(పవళింపు సేవ) నిర్వహించారు. ఈ కార్యక్రమాలు బొర్రా వాసుదేవాచార్యులు సమక్షంలో అర్చకులు, ఆగమపండితుల ఆధ్వర్యంలో వైభవంగా ఘనంగా  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త విజయ్‌కుమార్‌, చెన్నూరి మట్టపల్లిరావు, ఈవో నవీన్‌, అర్చకులు పాల్గొన్నారు.




Updated Date - 2022-05-20T05:53:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising