ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా భూమి మాకు ఇప్పించండి

ABN, First Publish Date - 2022-01-21T06:52:02+05:30

తన భూమిని తమకు ఇప్పించండి లేదా చావడానికైనా అనుమతివ్వాలని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌కు పోస్టు చేసిన యువకుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లేదంటే నేను చావడానికి అనుమతివ్వండి

మంత్రి కేటీఆర్‌కు కనగల్‌కు చెందిన ఓ యువకుడి ట్వీట్‌

నల్లగొండ, జనవరి 20: తన భూమిని తమకు ఇప్పించండి లేదా చావడానికైనా అనుమతివ్వాలని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కనగల్‌ మండలం జి.ఎడవెల్లి గ్రామానికి చెందిన చొప్పరి శ్రీను బుధవారం మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. వివరాల్లోకి వెళితే... జి. ఎడవెల్లి గ్రామానికి శ్రీనివాస్‌ తమకు 5.33 ఎకరాల పట్టా భూమిని ప్ర భుత్వ భూమి అని పేర్కొంటూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అం దులో ఐదెకరాల్లో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసి మిగతా 33 గుంట ల్లో ప్రైవేటు కార్యక్రమాలు నిర్వహిస్తూ తనను రోడ్డు పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. 1999 సంవత్సరంలో ఎస్‌ఎల్‌బీసీ మెయిన కెనాల్‌కు కట్ట పోయడం కోసం అప్పట్లో భూసేకరణ చేపట్టారు. తమకు ఎలాంటి ప రిహారం లభించలేదు. 2010 సంవత్సరంలో తాము మరికొంత భూమిని కొనుగోలు చేశామని, పాస్‌ పుస్తకంతో పాటు రైతుబంధు డబ్బులు కూడా త మ వస్తున్నాయని పేర్కొన్నారు. భూసేకరణలో పోయి ఉంటే రిజిస్ట్రేషన ఎలా జ రుగుతుందని అన్నారు. అధికారులు కా వాలని తమ కుటుంబాన్ని వీధి పాలు చేయడం కోసం తమ భూమిని బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. బీటె క్‌ పూర్తి చేసిన తాను నిరుద్యోగిగా ఉం టూ తన భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నానని, ఇంతలో ప్రభుత్వం భూ సేకరణలో భూమి పోయిందంటూ తీసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. భూసేకరణ చేసి ఉంటే 2010లో ఎలా పట్టా జరిగిందన్నారు. 2016 సంవత్సరంలో సమగ్ర సర్వే చేసి డిజిటల్‌ పాస్‌ పుస్తకం కూడా ఇచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వం పట్టా భూమిని లాక్కుంటే తన కుటుంబం ఎలా బతకాలని ప్రశ్నించారు. కలెక్టర్‌ ప్రశాంత జీవన పాటిల్‌, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, తహసీల్దార్‌కు మొర పె ట్టుకున్నా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆశిస్తున్నానని, న్యాయం చేయకపోతే తన చావుకు అనుమతివ్వాలని కోరుతున్నానని పేర్కొన్నారు. 

ఆ భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసింది  

సదరు భూములను ఎస్‌ఎల్‌బీసీ కెనాల్‌ కోసం ఉపయోగించడానికి ప్రభుత్వం కొనుగోలు చేసింది. అందుకు సంబంధించి గతంలోనే వీరందరికి పరిహారం కూడా అందజేశారు. ప్రభుత్వ అవసరాలు ఉన్నప్పుడు సే కరించిన భూమిని ఎప్పుడైనా ప్రభుత్వం స్వాఽధీనం చేసుకోవడంతో పా టు ఆ భూమిలో అభివృద్ధి పనులను చేయడానికి నిబంధనలు ఉన్నా యి. ఆర్డీవో, కలెక్టర్‌కు కూడా ఈ భూములకు సంబంధించి నివేదికలు కూడా అందజేశాం. నిబంధనల మేరకే ఆ భూమిలో ప్రభుత్వ అభివృద్ధి పనులు సాగుతున్నాయి.  

ఫ శ్రీనివా్‌సరావు, తహసీల్దార్‌, కనగల్‌



Updated Date - 2022-01-21T06:52:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising