ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్లుగీత కార్మికులకు ‘గీతబంధు’ ప్రకటించాలి

ABN, First Publish Date - 2022-01-24T05:51:05+05:30

కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం గీతబంధు పథకాన్ని ప్రకటించాలని గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండాల మల్లేష్‌, గౌడ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కన్వీనర్‌ అనంతుల శ్రీనివాసగౌడ్‌ డిమాండ్‌ చేశారు. మోత్కూరులో ఆదివారం

సమావేశంలో మాట్లాడుతున్న మల్లేష్‌గౌడ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోత్కూరు, జనవరి 23: కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం గీతబంధు పథకాన్ని ప్రకటించాలని గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండాల మల్లేష్‌, గౌడ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కన్వీనర్‌ అనంతుల శ్రీనివాసగౌడ్‌ డిమాండ్‌ చేశారు. మోత్కూరులో ఆదివారం ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కల్లుగీత కార్మికులు బీసీ సంక్షేమ శాఖ ద్వారా 15మంది గీత కార్మికులతో సంఘాలు ఏర్పాటు చేసుకుని నాలుగేళ్లఐనా ప్రభుత్వం నిధులు ఇవ్వలేదన్నారు. ఒక్కో సంఘంలో ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షలు ఇస్తామని చేప్పిన ప్రభుత్వం నేటికీ నిధులు విడుదల చేయలేదన్నారు. రానున్న బడ్జెట్‌లో కల్లు గీత కార్మికుల సంక్షేమం కోసం మోటారు సైకిళ్లు మంజూరు చేసేలా, చెట్టుపై నుంచి పడి గాయపడిన వారికి ఎక్స్‌గ్రేషియా చెల్లించేలా మంత్రులు సీఎం కేసీఆర్‌తో మాట్లాడాలన్నారు. సమావేశంలో గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొలకపురి శ్రీకాంత్‌గౌడ్‌, నాగరాజు, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-24T05:51:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising