ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గణేష్‌ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలి : డీసీపీ

ABN, First Publish Date - 2022-08-25T07:09:09+05:30

గణేష్‌ నవరాత్రి ఉత్సవాలను సంప్రదాయరీతిలో శాంతియయుతంగా, భక్తిభావంతో నిర్వహించాలని డీసీపీ నారాయణరెడ్డి అన్నారు. భువనగిరి పట్టణ గణేష్‌ నవరాత్రి ఉత్సవాల నిర్వాహకులు, పోలీస్‌ తదితర ప్రభుత్వ శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు.

సమావేశంలో మాట్లాడుతున్న డీసీపీ నారాయణరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరి టౌన్‌, ఆగస్టు 24 : గణేష్‌ నవరాత్రి ఉత్సవాలను సంప్రదాయరీతిలో శాంతియయుతంగా, భక్తిభావంతో నిర్వహించాలని డీసీపీ నారాయణరెడ్డి అన్నారు. భువనగిరి పట్టణ గణేష్‌ నవరాత్రి ఉత్సవాల నిర్వాహకులు, పోలీస్‌ తదితర ప్రభుత్వ శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 31న ప్రారంభమయ్యే ఉత్సవాలు సెప్టెంబరు 8న సామూహిక నిమజ్జనంతో ముగించాలని సూచించారు. గణేష్‌ మండపాల వద్ద నిర్వాహకులు పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకోవాలని, పోలీసులు కూడా ప్రతి మండపం వద్ద భద్రత కల్పిస్తారని అన్నారు. వదంతులను  నమ్మవద్దని, అనుమానాస్పద వస్తువులు, వ్యక్తుల కదలికలపై పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. భువనగిరి గణేష్‌ ఉత్సవ సమితి అధ్యక్షుడు పట్నం కపిల్‌ మాట్లాడుతూ నిబంధనల పే రిట ఉత్సవాల నిర్వాహకులను వేధించవద్దని,  ఉత్సవాల నిర్వాహణకు అధికారులు పూ ర్తిస్థాయి సహకారం అందించాలన్నారు. సమావేశంలో ఏసీపీ ఎస్‌ వెంకట్‌రెడ్డి, పట్టణ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ, ట్రాన్స్‌కో ఏఈ హరినాథ్‌, మునిసిపల్‌ డీఈ మాధవాచారి, ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి మహేందర్‌,  మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-25T07:09:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising