ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచానికి మార్గదర్శకుడు గాంధీజీ

ABN, First Publish Date - 2022-10-03T05:54:52+05:30

అహింసామార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన గాంధీ మహాత్ముడు ప్రపంచానికి మార్గదర్శకుడని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, హైకోర్డు జడ్జి పి.మాధవిదేవి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా మండలంలోని పెద్దకాపర్తి శివారులో గాంధీ గుడి లో ఆదివారం నిర్వహించిన పూజల్లో పాల్గొని మాట్లాడారు.

పెద్దకాపర్తి గాంధీగుడిలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌డ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి

చిట్యాలరూరల్‌, అక్టోబరు 2: అహింసామార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన గాంధీ మహాత్ముడు ప్రపంచానికి మార్గదర్శకుడని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, హైకోర్డు జడ్జి పి.మాధవిదేవి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా మండలంలోని పెద్దకాపర్తి శివారులో గాంధీ గుడి లో ఆదివారం నిర్వహించిన పూజల్లో పాల్గొని మాట్లాడారు. హింసా మార్గంలో వెళ్తున్న నేటి సమాజంలో అందరూ గాంధీ చూపిన మార్గాన్ని అనుసరిస్తే సమస్యలు దూరమవుతాయన్నారు. గాంధీని మహాత్ముడిగా కొలవడమేగాక ఆయనపై అభిమానంతో మహాత్మా చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో గుడిని నిర్మించడం, ఇక్కడ నిత్యం పూజలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజలకు ఈ అవకాశాన్ని కల్పించిన సంస్థ ట్రస్టీ మోర శ్రీపాల్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు మోర భూపాల్‌రెడ్డి, ట్రస్ట్‌ కార్యదర్శి పారుపల్లి వెంకటకృష్ణారావు, డా. సీతతో పాటు సభ్యులందరినీ అభినందించాల్సిన విషయమన్నారు. అనంతరం మహిళలకు పండ్లను హైకోర్డు జడ్జి మాధవిదేవి పంపిణీ చేశారు. కార్యక్రమంలో నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎఫ్‌ఐసీసీ ఐ చైర్‌పర్సన్‌ మహేశ్వరి, ఏపీ మాజీ మంత్రి పి.నారాయణ, గాం ధీగుడి సలహాదారుడు జోగినపల్లి శ్రీనివాసరావు,  ఏపీ రెడ్డి కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎ.సత్యనారాయణరెడ్డి, ఎన్‌సీసీ డైరెక్టర్‌ ఏవీఎన్‌.రాజు, సర్పంచ్‌ మర్రి జలంధర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ నూతి సత్యశ్రీవెంకటేశం, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు, తేరటుపల్లి హనుమంతు, వాసా విద్యాసాగర్‌, కలకుంట్ల రవి, వనమా ప్రవీణ్‌, జిట్ట నరేష్‌ తదితరులు పాల్గొన్నారు. పూజల అనంతరం అతిథులకు పురోహితులు ఆశీర్వచనం చేయగా, ట్రస్టు సభ్యులు జ్ఞాపికలు, గాంధీ చరిత్ర పుస్తకాలను అందజేశారు.

Updated Date - 2022-10-03T05:54:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising