ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజీనామా చేశాకే మునుగోడుకు నిధులు

ABN, First Publish Date - 2022-08-20T06:07:12+05:30

తన రాజీనామాతోనే మునుగోడు నియోజ కవర్గానికి ప్రభుత్వం నిధులు మంజూరుచేస్తోందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

విలేకరులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

మునుగోడు, ఆగస్టు 19: తన రాజీనామాతోనే మునుగోడు నియోజ కవర్గానికి ప్రభుత్వం నిధులు మంజూరుచేస్తోందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మునుగోడులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాల మధ్య అసమానతలను చూపుతూ తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రధానంగా తాను ప్రతిపక్ష ఎమ్మెల్యే అనే కారణంతో మునుగోడు అభివృద్ధికి నిధులు కేటాయించకుండా కక్షసాధింపు చర్యలకు పాల్పడిన కేసీఆర్‌ ఇక్కడికి వచ్చే ముందు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అంటే సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌ వంటి ప్రాంతాలు మాత్రమే కాదన్నారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించకుండా సీఎం పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. ఈ ఉపఎన్నికలో టీఆర్‌ఎ్‌సను ఓడించి కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలన్నారు. మాజీ ఎంపీలు వివేక్‌ వెంకట్‌స్వామి, రవీందర్‌నాయక్‌లు మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్మించే ప్రాజెక్ట్‌లు అభివృద్ధికోసం కాదని, అవి కేవలం సీఎం కేసీఆర్‌ కుటుంబ అభివృద్ధి కోసమేనని అన్నారు. సమావేశంలో నాయకులు దోనూరి వీరారెడి, డీసీసీబీ డైరెక్టర్‌ కుంభం శ్రీనివా్‌సరెడ్డి, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-20T06:07:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising