ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారం రోజులుగా మంచినీటి సరఫరా బంద్‌

ABN, First Publish Date - 2022-05-24T06:56:22+05:30

గ్రామంలో వారం రోజులుగా మంచినీటిని సరఫరా చేయడం లేదని ఆగ్రహించిన గ్రామస్థులు పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు.

ఖాళీ బిందెలతో ధర్నా చేస్తున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గ్రామపంచాయతీ కార్యాలయానికి తాళం

 బోర్లు కాలిపోయి వారమైనా స్పందించడం లేదని ఆగ్రహం

 సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో ఘటన

నడిగూడెం, మే 23: గ్రామంలో వారం రోజులుగా మంచినీటిని సరఫరా చేయడం లేదని ఆగ్రహించిన గ్రామస్థులు పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలోని కరివిరాల గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన గార్లపాటి మహేష్‌రెడ్డి, జ్యోతి మాట్లాడుతూ వారం రోజులుగా సగం గ్రామానికి నీరు రావడంలేదని, ఇదేమని అడిగితే సర్పంచ్‌, కార్యదర్శి, సిబ్బంది పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామం లో ఉన్న నాలుగు బోర్లు కాలిపోయినా వాటికి మరమ్మతులు చేయించడం లేదన్నారు. మంచినీరు లేక వ్యవసాయ బోర్లు, బావుల వద్ద నుంచి తెచ్చు కోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 50మంది మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తంచేశారు. సమస్యను పరిష్కరిస్తానని కార్యదర్శి నాగరాజు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు పంచాయతీ కార్యాలయం తాళం తీశారు. ఈ విషయమై గ్రామ కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ బోరు మోటార్లు కాలిపోయాయని దృష్టికి తెసుకెళ్లినా మండల అధికారులు స్పందించడంలేదని తెలిపారు. లక్షలాది రూపాయల బిల్లులు ఆగిపోయాయని, తాము ఏమీ చేయలేమని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మ, మౌనిక, రజని, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T06:56:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising