ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమ్ముడి హత్య కేసులో సోదరుడు సహా ఐదుగురి అరెస్టు

ABN, First Publish Date - 2022-08-17T06:24:12+05:30

తమ్ముడిని చంపిన కేసులో సోదరుడు సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిచారు. మంగళవారం నడిగూడెం పోలీ్‌సస్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కోదాడ డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి ఈ కేసు వివరాలను వెల్లడించారు.

నడిగూడెంలో కేసు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నడిగూడెం, ఆగస్టు 16: తమ్ముడిని చంపిన కేసులో సోదరుడు సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిచారు. మంగళవారం నడిగూడెం పోలీ్‌సస్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో  కోదాడ డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి ఈ కేసు వివరాలను వెల్లడించారు. నడిగూడెం మండలం వల్లాపురం గ్రామానికి చెందిన కొప్పెర వీరబాబు, అన్నయ్య భధ్రయ్య మధ్య మూడేళ్లుగా భూవివాదం నడుస్తోంది. సర్వే నెం.397లో ఉన్న  12 గుంటల భూమి కోసం అన్నాదమ్ములు ఘర్షణ పడుతున్నారు. పెద్ద మనుషుల సమక్షంలో రాజీకి రాకపోవడంతో సమస్య పరిష్కరం కాలేదు. భూమిని ఆక్రమించేందుకు అన్న భద్రయ్య పధకం పన్నాడు. ఇందుకోసం ఈ నెల 14న వీరబాబు పొలంలో నాటువేస్తున్న విషయం తెలిసి భద్రయ్య, అతడి భార్య సరోజిని, కుమార్తె  నవ్య, వదిన  (ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండలం బుద్ధారం గ్రామానికి చెందిన పర్వత సుభద్ర). ఆమె కుమారుడు వీరప్రసాద్‌లు కలిసి దాడి చేశారు. ముందుగా వేసుకున్న పధకం ప్రకారం..  వీరబాబు కంట్లో కారంచల్లి కర్రలతో తీవ్రంగా కొట్టారు. అక్కడికక్కడే వీరబాబు మృతి చెందగా హత్య చేసిన ఐదుగురు  పరారై బుద్ధారంలోని పర్వత వెంకటేశ్వర్లు ఇంట్లో తలదాచుకున్నారు. వీరబాబు భార్య పద్మ ఫిర్యాదుమేరకు కేసు దర్యాప్తు చేసిన మునగాల సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ ఏడుకొండలు విశ్వసనీయ సమాచారం మేరకు బుద్ధారంలో ఉన్న ఐదుగురిని మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చి, కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. హత్యకు ఉపయోగించిన నాలుగు కర్రలు, కారంపొడి, దుస్తులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ ఏడుకొండలు, ఏఎ్‌సఐ జగన్నాథం సిబ్బంది పాల్గొన్నారు.

గంజాయి రవాణాపై నిరంతర నిఘా 

 గంజాయి అక్రమ రవాణాపై నిరంతరం నిఘా పెట్టినట్లు  డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. గంజాయి ఏవోబీ నుంచి ఏపీ మీదుగా రాష్ట్రంలోకి అధికంగా రవాణా అవుతోందని, రెండు రాష్ట్రాల సరిహద్దు అయిన కోదాడ మండలం రామాపురం చెక్‌పోస్టు వద్ద ముమ్మర తనిఖీలు చేస్తున్నామన్నారు. ఇటీవల కోదాడ పరిధిలో 15, సూర్యాపేట పరిధిలో 20 కేసులు నమోదు చేశామన్నారు. గంజాయి రవాణా చేస్తున్నవారిని రాజకీయ నాయకుల ఒత్తిడితో వదిలిపెట్టడంలేదని,  అవన్నీ పుకార్లేనని అన్నారు. గంజాయి కేసులను రాష్ట్రస్థాయిలో ప్రత్యేక బృందాలు, నల్లగొండ పోలీసులే కేసులు నమోదు చేస్తునందున ఈ కేసుల్లో తమ ప్రమేయం ఉండదన్నారు. గంజాయితో పాటు హుజూర్‌నగర్‌, మేళ్లచెర్వు, మునగాల, మోతె తదితర మండలాల్లో ఇటీవల జరిగిన దొంగతనాల కేసులు చాలా వరకు ఛేదించామమని, మరికొన్ని పురోగతిలో ఉన్నాయన్నారు. 




Updated Date - 2022-08-17T06:24:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising