ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎ్‌సలో భగ్గుమన్న ఆధిపత్య పోరు

ABN, First Publish Date - 2022-05-24T06:30:17+05:30

టీఆర్‌ఎ్‌సలో ఆధిపత్య పోరు భగ్గుమంది. మండలంలో అనేక గ్రామాల్లో వర్గపోరు కొనసాగుతుండగా, సోమవారం కొమరబండ గ్రామంలో

ఒకరినొకరు నెట్టుకుంటున్న ఉపేందర్‌గౌడ్‌, రామారావు వర్గీయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎమ్మెల్యే సమక్షంలో నెట్టుకున్న నాయకులు

కోదాడ రూరల్‌, మే 23: టీఆర్‌ఎ్‌సలో ఆధిపత్య పోరు భగ్గుమంది. మండలంలో అనేక గ్రామాల్లో వర్గపోరు కొనసాగుతుండగా, సోమవారం కొమరబండ గ్రామంలో ఎమ్మెల్యే ఎదుటనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఉదయం ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌ కొమరబండ గ్రామంలో గొర్రెల పంపిణీ కార్యక్రమం ప్రారంభించేందుకు రాగా, ఆ సమయంలో గ్రామానికి చెందిన కోదాడ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ సంపెట ఉపేందర్‌గౌడ్‌ను వేదిక మీదకి ఆహ్వానించలేదని ఆయన వర్గానికి చెందిన పార్టీ కార్యకర్తలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమాన్ని మునిసిపల్‌ కౌన్సిలర్‌ మామిడి పద్మావతి కుమారుడు రామారావు నిర్వహించారు. రామారావు కావాలనే ఉపేందర్‌గౌడ్‌ను వేదిక మీదకి ఆహ్వానించలేదని ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడుతూ ఘర్షణపడి ఒకరినొకరు నెట్టుకుంటూ దూషించుకున్నారు. ఈ విషయమై ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో ఎమ్మెల్యే అర్ధాంతరంగా సభ ముగించి, ఇరువర్గాలు సమన్వయంతో పనిచేయాలని సూచించి వెళ్లిపోయారు.

Updated Date - 2022-05-24T06:30:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising