ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోరాట యోధుడు కొండా లక్ష్మణ్‌బాపూజీ

ABN, First Publish Date - 2022-09-28T06:43:28+05:30

తెలంగాణ మణి దీపం కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి అన్నారు.

ఆలేరులో కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ప్రభుత్వ విప్‌ సునీత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గొంగిడి సునీతమహేందర్‌రెడ్డి 

జిల్లా వ్యాప్తంగా జయంతి కార్యక్రమాలు

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, సెప్టెంబరు 27:తెలంగాణ మణి దీపం కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి అన్నారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి సందర్భంగా మంగళవారం ఆలేరులో  పద్మశాలీ సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో  ఆయన విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములుతో కలిసి  ఆవిష్కరించి మాట్లాడారు.  కులవృత్తుల వారిని ప్రోత్సహించేందుకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని పోరాడిన మహా నాయ కుడని కొనియాడారు.  కార్యక్రమంలో పద్మశాలీ సంఘంపట్టణ అధ్యక్షుడు బింగి నర్సింహులు, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు  బూడిద భిక్షమయ్య గౌడ్‌, చింతకింది మల్లేశం, టీపీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య, శంకరయ్య పాల్గొన్నారు. 

- దేశ స్వాతంత్య్రం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్‌ బాపూజీ చేసిన పోరాటం మరవలేనిదని పీవీటీ ఫౌండర్‌ కమిటీ అధ్యక్షుడు భారత పురుషోత్తం అన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి సందర్భంగా భూదాన్‌పోచంపల్లిలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు.  కార్యక్రమంలో నాయకులు కైరంకొండ సత్యనారాయణ, జెల్ల లక్ష్మీనారాయణ, పెండెం జనార్దన్‌,  పీవీటీ మర్చంట్‌ కమిటీ అధ్యక్షుడు కైరంకొండ ఽధనుంజయ, ఉపాధ్యక్షుడు శీధర్‌ పాల్గొన్నారు.



Updated Date - 2022-09-28T06:43:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising