ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వైబ్రా’ కార్మికులకు న్యాయం చేసే వరకు పోరాటం

ABN, First Publish Date - 2022-09-19T05:48:06+05:30

వైబ్రా కంపెనీ కార్మికులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని బీజేపీ రాష్ట్ర నాయకుడు గూడూరు నారాయణరెడ్డి అన్నారు.

మాట్లాడుతున్న బీజేపీ నాయకుడు నారాయణరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీబీనగర్‌, సెప్టెంబరు 18: వైబ్రా కంపెనీ కార్మికులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని బీజేపీ రాష్ట్ర నాయకుడు గూడూరు నారాయణరెడ్డి అన్నారు. బీబీనగర్‌లో మూతపడిన వైబ్రా అటోమెటిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఎదుట బీఎంఎస్‌ ఆఽధ్వర్యంలో కార్మికులతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. యాజమాన్యం కార్మికులకు సమాచారం ఇవ్వకుండా కంపెనీని మూసి వేయడమే కాకుండా, ఇక్కడి భూములను కూడా విక్రయించడానికి ప్రయత్నిం చడం దారుణమన్నారు. కార్మికులకు ఆరు నెలల వేతనంతో పాటు ఇతర సదుపాయలు రూ.6.70 కోట్లు  చెల్లించాల్సి ఉందన్నారు. రెండు దశాబ్ధాలుగా కంపెనీని నమ్ముకొని జీవిస్తున్న వంద మందికి పైగా కార్మిక కుటుంబాలు వీధినపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మి కులకు బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను  కోరి నట్లు తెలిపారు. కార్మికులకు తెలియకుండా యాజమాన్యం కంపెనీ భూములను విక్రయించాలని చూస్తోందని, భూములు అమ్మకుండా నిషేదిత జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కా ర్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సురికంటి జంగారెడ్డి, బీఎం ఎస్‌ అధ్యక్షుడు చెన్నకేశవులు, రాజిరెడ్డి, జోగిరెడ్డి, బొబ్బల అంజిరెడ్డి, భిక్షపతిగౌడ్‌, బాలకృష్ణ, సదానందం, అనంతరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-19T05:48:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising