ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫీల్డ్‌ అసిస్టెంట్లు.. ఉపాధి కూలీలయ్యారు

ABN, First Publish Date - 2022-04-24T05:34:49+05:30

ఉపాధిహమీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లు పలువురు ఉపాధి కూలీలయ్యారు. ఇటీవల తొలగించిన ఫీల్డ్‌ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ప్ర

తిరుగండ్లపల్లి గ్రామంలో ఉపాధిహామీ కూలీగా పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మర్రిగూడ, ఏప్రిల్‌ 23: ఉపాధిహమీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లు పలువురు ఉపాధి కూలీలయ్యారు. ఇటీవల తొలగించిన ఫీల్డ్‌ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ప్ర భుత్వం చెప్పి నెలరోజులు గడుస్తున్నా, ఇప్పటివరకు తీసుకోకపోవడంతో ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఉపాధి కూలీలుగా మారారు. న్యాయమై డిమాండ్ల సాధనకు ఆందోళన చేపట్టి ఉన్న ఉద్యోగా లు పోగొట్టుకున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లు తమ ఉద్యోగంకోసం అనేక ప్రయత్నాలు చేశారు. ఎంతకీ ఫలించకపోవడం తో రెండేళ్లుగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులుపడ్డారు. పోయిన ఉద్యోగంరాకపోతుందా అని కొందరు ఎదురు చూస్తుండగా మరికొందరు ఆశలు వదులుకొని ఇతర పనులు చేసుకుంటున్నారు. మర్రిగూడ మండలంలో 20 గ్రామపంచాయతీలకుగాను 16 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఉండగా, తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వారు 2020లో సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. అయితే సమ్మె విరమించి విధుల్లో చేరాలని ప్రభుత్వం హెచ్చరించినా వారు వినకపోవడంతో, ప్రభుత్వం విధుల నుంచి తొలగించిం ది. దీంతో వారు రెండేళ్లుగా ఆర్థిక ఇబ్బందులుపడుతూ కుటుంబ పోషణభారంగా మారడంతో ఉపాధిహమీ పథకంలోనే కూలీలుగా మారి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.  

Updated Date - 2022-04-24T05:34:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising