ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జ్వర సర్వేను పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-01-22T06:19:50+05:30

కొవిడ్‌ నియంత్రణలో భాగంగా ప్రజా ఆరోగ్య దృష్ట్యా చేపడుతున్న జ్వర సర్వేను పకడ్బందీగా చేపట్టి రెండు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్‌ పమేలా సత్పథి వైద్య సిబ్బందికి సూచించారు.

మోటకొండూరు: వైద్య సిబ్బందికి సూచిస్తున్న కలెక్టర్‌ పమేలా సత్పథి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోటకొండూర్‌, జనవరి 21: కొవిడ్‌ నియంత్రణలో భాగంగా ప్రజా ఆరోగ్య దృష్ట్యా చేపడుతున్న జ్వర సర్వేను పకడ్బందీగా చేపట్టి రెండు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్‌ పమేలా సత్పథి వైద్య సిబ్బందికి సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని అంగనవాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మికంగా సందర్శించి మాట్లాడారు. ప్రతి ఇంటినీ సర్వే చేసి, కుటుంబ ఆరోగ్య పరిస్థితులను, కొవిడ్‌ లక్షణాలు బట్టి హోం ఐసోలేషనలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా వ్యాక్సిన రెండో డోస్‌ను 100 శాతం పూర్తి చేసి అర్హులైన వారికి బూస్టర్‌ డోస్‌ ఇవ్వాలని సూచించారు. ఆమె వెంట ఎంపీడీవో వీరస్వామి, ఉప సర్పంచ శ్రీనివాస్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ పద్మ, వైద్య సిబ్బంది దేవవర, యాకయ్య ఉన్నారు. కాగా మండలంలోని పలు గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి జ్వర సర్వే చేశారు. 

యాదాద్రి రూరల్‌: గ్రామీణ ప్రాంతాల్లో ఫీవర్‌ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ పమేలాసత్పథి ఆదేశించారు. మండలంలోని మహబూబ్‌పేటలో గ్రామంలోని ఫీవర్‌ సర్వేను పరిశీలించారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. 

ఆత్మకూరు(ఎం) : ఆత్మకూరు(ఎం) ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ పమేలా సత్పథి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొవిడ్‌ పరీక్షా కేంద్రాన్ని, ఆపరేషన థియేటర్‌ గది, ల్యాబ్‌, రోగుల వార్డులను ఆమె పరిశీలించారు. సీహెచవో కరుణాకర్‌ ఏఎనఎంలు సాంబులమ్మ, సుజాత ఆమె వెంట ఉన్నారు.


Updated Date - 2022-01-22T06:19:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising