ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులు అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2022-11-24T00:48:44+05:30

వర్షాలు పడే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన రైతులు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సహకారం సంఘం అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఇందిర అన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఇందిర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోదాడ రూరల్‌, నవంబరు 23: వర్షాలు పడే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన రైతులు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సహకారం సంఘం అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఇందిర అన్నారు. కోదాడ పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో మండలంలోని తమ్మర గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్‌ ఆవుల రామారావుతో కలిసి ఆమె బుధవారం పరిశీలించి మాట్లాడారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని తేమ శాతం ఆధారంగా కొనుగోలు చేసి వెంటనే మిల్లులకు తరలించాలని అన్నారు. చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తా మని, రైతులు ఆందోళన చెందవద్దన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు ప్రభుత్వం వెంటనే నగదు జమ చేస్తున్నందున కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులు అన్ని రకాల ధ్రువపత్రాలు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఏఈవో చాంద్‌బి, సొసైటీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T00:48:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising