రైతు కష్టం దొంగలపాలు
ABN, First Publish Date - 2022-12-15T00:22:08+05:30
ఆరుగాలం కష్టించి పండించిన పంట దొంగలపాలు కావడంతో రైతుకు దుఃఖమే మిగిలింది. నల్లగొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డ గ్రామంలో బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
చేతికొచ్చిందే కొంత.. చివరికి మిగిలింది పిసరంత
తండ్రి దశదిన కర్మ అనంతరం విక్రయిద్దామని నిల్వ
అంతలోనే 30 క్వింటాళ్ల పత్తి చోరీ
నల్లగొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డలో ఘటన
చండూరు రూరల్, డిసెంబరు 14: ఆరుగాలం కష్టించి పండించిన పంట దొంగలపాలు కావడంతో రైతుకు దుఃఖమే మిగిలింది. నల్లగొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డ గ్రామంలో బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బంగారిగడ్డ గ్రామానికి చెందిన వర్కాల భిక్షమయ్య తనకున్న ఏడు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. ఎకరాకు 10 క్వింటాళ్ల పత్తి దిగుబడి రావల్సి ఉండగా, ఆరున్నర క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. గత నెలలో పత్తికి ధర తక్కువగా ఉండడంతో (క్విం టా రూ.8వేలు) ధర వచ్చినప్పుడు విక్రయిద్దామని భావించి ఇటీవల ఏరిన 45 క్వింటాళ్ల పత్తిని తన వ్యవసాయ పొలం వద్ద కొట్టంలో నిల్వ ఉంచాడు. ఈ నెల 1వ తేదీన భిక్షమయ్య తండ్రి రామచంద్ర అనారోగ్యంతో మృతి చెందగా, దశదిన కర్మ అనంతరం పత్తిని విక్రయిద్దామనుకున్నాడు. దశనదినకర్మ ఈ నెల 10వ తేదీన పూర్తికావడంతో ఖర్చుల నిమిత్తం పత్తిని విక్రయించేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ఉదయం ఆరు గంటలకు పొలా నికి వెళ్లి పత్తిని పరిశీలించగా, అందులో మొత్తం 45 క్వింటాళ్లకు 15 క్విం టాళ్లు మాత్రమే ఉంది. 30 క్వింటాళ్ల పత్తి చోరీకి గురైందని గుర్తించాడు. పత్తి విలువ క్వింటాకు ప్రస్తుతం సుమారు రూ.7,800 ఉండగా, రూ.2, 34,000 విలువైన 30 క్వింటాళ్ల పత్తి బుధవారం రాత్రి చోరీకి గురైనట్లు గమనించాడు. చోరీ చేసి వాహనంలో తీసుకువెళ్లిన టైర్ల గుర్తులు ఉ న్నాయని, ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని చండూరు పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రాథమిక విచారణ అనంతరం కేసు నమోదు చేస్తానని ఎస్ఐ నవీన్‌కుమార్ చెప్పినట్లు రైతు తెలిపారు. భిక్షమయ్యకు భార్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. తల్లి నర్సమ్మ భిక్షమయ్య వద్దే ఉంటోంది.
Updated Date - 2022-12-15T00:22:09+05:30 IST