రైతుల రుణాలను ఏక కాలంలో మాఫీ చేయాలి
ABN, First Publish Date - 2022-08-04T06:19:31+05:30
రైతుల రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు డిమాండ్‌చేశారు.
చౌటుప్పల్, ఆగస్టు 3: రైతుల రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు డిమాండ్‌చేశారు. చౌటుప్పల్ మండల కేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారకభవనలో రైతు సంఘం మండల ప్రఽథమ మహాసభ జరిగింది. ఈసందర్భంగా బాలరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి పంటరుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం నేటికీ అమలు చేయడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరల చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత సంస్కరణ బిల్లులు తక్షణమే ఉపసంహరించాలని కోరారు. రైతులకు పంటరుణాల కోసం 85380 కోట్లు ప్రకటించిన ప్రభుత్వం ఆచరణలో అమలు చేయడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి బూర్గు కృష్ణారెడ్డి, నాయకులు బండారు నర్సింహ, బత్తుల శ్రీశైలం, చెన్నగోని వెంకటేశం, పర్నె ధర్మారెడ్డి, ఉష్కాగుల శ్రీనివాస్, బావండ్లపల్లి స్వామి, బత్తుల లక్ష్మయ్య, బండారు చంద్రారెడ్డి, చీకూరి ఈదయ్య, యాదయ్య పాల్గొన్నారు.
Updated Date - 2022-08-04T06:19:31+05:30 IST