ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంపూర్ణ అక్షరాస్యత సాధించడంలో విఫలం

ABN, First Publish Date - 2022-08-14T05:16:36+05:30

నేటికీ సంపూర్ణ అక్షరాస్యత సాధించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేటఅర్బన్‌ / కోదాడ, ఆగస్టు 13: నేటికీ సంపూర్ణ అక్షరాస్యత సాధించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎ్‌సయూటీఎఫ్‌ కార్యాలయంలో విద్యారంగ పరిస్థితులు అనే అంశంపై శనివారం నిర్వహించిన సద స్సులో ఆయన మాట్లాడారు. స్వాతంత్రం అనంతరం అనేక విద్యాకమిషన్లు రూపొందించినా వాటిని అమలుచేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని ఆరోపించారు. విద్యాశాఖలో బడ్జెట్‌ కేటాయింపులు తిరోగమన స్థితిలో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో టీఎ్‌సయూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సిరికొండ అనిల్‌కుమార్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాములు, సోమయ్య, వెంకటయ్య, యాకయ్య, వీరారెడ్డి, పాపిరెడ్డి, వెంకన్న, రమేష్‌, అనిల్‌కుమార్‌, క్రాంతి పాల్గొన్నారు. కోదాడలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. విద్య, వైద్య రంగాలలోనూ సమస్యలను ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయ పోస్టులను, ఉపాధ్యాయేతర పోస్టులను వెంటనే భర్తీ చేసి, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో టీపీ ఎస్‌యూ నాయకులు కె.మంగ, ధనమూర్తి, వీరారెడ్డి, వీరబాబు, రాంబాబు, వెంకట్‌రెడ్డి, రామ్మూర్తి, నాగజ్యోతి, ఖాజామియా, వెంకటరమణ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-14T05:16:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising